Advertisement

వరుణ్-లావణ్య త్రిపాఠి వివాహం ఆ పద్దతిలోనే..


హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆగష్టు 24న వరుణ్-లావణ్య ల వివాహానికి తేదీ నిశ్చయించారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయంపై మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి సమాచారం లేదు. వరుణ్-లావణ్యల నిశ్సితార్ధం సింపుల్ గా మెగా ఫ్యామిలీ-లావణ్య ఫామిలీస్ మధ్యన జరిగిపోయింది. పెళ్లిని మాత్రం అంగరంగవైభవంగా జరిపించాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారట.. కానీ వరుణ్-లావణ్యలు ఇటలీలో ఉన్నప్పుడే ప్రేమలో పడడంతో.. పెళ్లిని అక్కడే చేసుకోవాలనుకున్నారట.

Advertisement

అందుకే మెగా ఫ్యామిలీతో పాటుగా లావణ్య త్రిపాఠి ఫామిలీస్ కలిసి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఓ రేంజ్ లో ఏర్పట్లని మొదలు పెట్టారట. అక్కడ ఈవెంట్ ప్లానెర్స్ ఆధ్వర్యంలో వరుణ్ తేజ్-లావణ్య ల వివాహానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని టాక్. ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ మెంబెర్స్, లావణ్య కుటుంబ సభ్యులతో పాటుగా కొద్దిమంది సన్నిహితులు కలిపి మొత్తంగా ఓ 50 మంది మాత్రమే ఇటలీకి వెళ్ళబోతున్నారట. తక్కువ మందితో పెళ్లి సింపుల్ గా ముగించేస్తారనుకుంటున్నారేమో..

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం చాలా కొత్తగా రాచరికపు పద్ధతిలో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లోనే నాగబాబు ఘనంగా రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని.. ఈ రిసెప్షన్ సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Varun Tej lavanya Tripathi wedding plans out:

Varun Tej-Lavanya Tripathi wedding: Couple to get married in Italy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement