మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. కియారా అద్వానీ అభిమానులు కూడా టాప్ డైరెక్టర్ శంకర్ పై కినుకు వహిస్తున్నారు. రామ్ చరణ్ తో రెండేళ్ల క్రితమే మొదలు పెట్టిన గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎక్కడివరకు జరిగిందో అనేది కూడా బయటపెట్టకుండా, రిలీజ్ తేదీ ఇవ్వకుండా మెగా ఫాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు, శంకర్ లపై మెగా అభిమానులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రామ్ చరణ్ బర్త్ డే కి గేమ్ ఛేంజర్ టైటిల్ అలాగే చరణ్ లుక్ రివీల్ చేసి చేతులు దులిపేసుకున్నారు.
ఈరోజు సోమవారం జులై31 న కియారా అద్వానీ బర్త్ డే. ఈ రోజు ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ లో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ లుక్ వదులుతూ టీం ఆమెకి బర్త్ డే విషెస్ తెలుపుతుంది అని మెగా ఫాన్స్ కూడా చాలా వెయిట్ చేసారు. కానీ కియారా పుట్టిన రోజు వచ్చింది మరికాసేపట్లో వెళ్ళిపోతుంది. కానీ కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ నుండి విషెస్ అందలేదు. ఆమెకి ఎలా ఉందో కానీ.. మెగా ఫాన్స్ కి మాత్రం శంకర్ పై విపరీతమైన కోపమొచ్చేస్తుంది. కియారా అభిమానులు కూడా చాలా డిస్పాయింట్ అవుతున్నారు.
ఎందుకు శంకర్ గేమ్ ఛేంజర్ విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు. అసలు రామ్ చరణ్-దిల్ రాజు లు ఊరుకుంటున్నారు. ఇంతకీ గేమ్ చెంజర్ షూటింగ్ ఎక్కడి వరకు అయ్యిందో కనీసం అప్ డేట్ ఇవ్వండ్రా అయ్యా అంటూ రిక్వెస్ట్ నుండి వేడుకునే స్థాయికి మెగా ఫాన్స్ వచ్చేసారు.