నారా లోకేష్ 170 రోజులుగా ఏపీలో పాద యాత్ర చేపట్టారు. పాద యాత్రతో పాటుగా సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వెనుకబడిన వర్గాలు, ధనిక వర్గాలు అనే భేదం లేకుండా ప్రజలతో మమేకమై ఎండనక వాననక నారా లోకేష్ పాద యాత్రలో చాల ఎనెర్జీతో కనిపిస్తున్నారు. పప్పు పప్పు అంటూ ఎగతాళి చేసే వారికి తన లుక్ తో, నడకతో, స్టయిల్ తో, స్పీచ్ తో సమాధానం చెబుతూ వస్తున్నారు. రోజు రోజుకి బలాన్ని పెంచుకుంటూ పాద యాత్రలో నడకని కొనసాగిస్తున్న నారా లోకేష్ కి తాజాగా పెను ప్రమాదం తప్పింది.
ఈరోజు 171వరోజు అద్దంకి మధురానగర్ నుంచి పాద ప్రారంభించిన లోకేష్ కి సంఘీభావంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకోగా, టిడిపి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు లోకేష్. దర్శి నియోజకవర్గం లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన జనసందోహం ఒక్కసారిగా లోకేష్ మీదకి దూసుకురావడంతో లోకేశ్ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఈ తోపులాటలో 3 సార్లు కింద పడబోయిన లోకేష్ ని ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తతతో సేవ్ చెయ్యడంతో లోకేశ్ కు పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తుంది.