మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ మాతృ భాష కన్నా ఎక్కువగా చెన్నై లోనే కనిపిస్తుంది. తమిళ్ లో భారీ ప్రాజెక్ట్స్ లో మెరిసిన మాళవికకి ఇంకా సక్సెస్ దరి చేరలేదు. ధనుష్, విజయ్ లాంటి స్టార్స్ తో పెద్ద సినిమాలు చేసింది కానీ ఆమెకి ఆ సినిమాల రిజల్ట్ అంతగా హెల్ప్ అవ్వలేదు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి మూవీలో నటిస్తుంది. ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న మాళవిక మోహనన్ గురించి ఇప్పుడు ప్రభాస్ అభిమానులు తెగ వెతికేస్తున్నారు.
అటు మాళవిక మోహనన్ కూడా తరచూ తన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా జిమ్ పిక్ ని షేర్ చేస్తూ.. Back to the 🏋️♀️after 2 weeks of being a 🥔 రెండు వారాల తర్వాత మళ్ళీ మొదలు పెట్టినట్టుగా మాళవిక జిమ్ పిక్ ని షేర్ చేసింది. అయితే హీరోయిన్స్ అన్నాక జిమ్ వేర్ లో కనిపించడం సహజమే. ముంబై భామలైతే ఈ జిమ్ వీడియోస్, పిక్స్ తోనే సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తారు. సౌత్ హీరోయిన్స్ జిమ్ వేర్ లో చాలా అరుదుగా కనబడతారు.
అందుకే మాళవిక మోహనన్ జిమ్ పిక్ పోస్ట్ చెయ్యగానే అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఇప్పటివరకు శారీస్, మోడ్రెన్ డ్రెసులు, చుడీదార్స్ లో గ్లామర్ షో చేసిన మాళవిక ఇప్పుడు జిమ్ వేర్ లో కనిపించి షాకిచ్చింది.