ఈమధ్య కాలంలో ఒక్క హీరోయిన్ నటించిన సినిమాల అప్ డేట్స్ ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ కి లక్కీ హీరోయిన్ గా మారిన శ్రీలీల ఒకేరోజు ఎనిమిది ప్రాజెక్ట్స్ నుండి బర్త్ డే విషెస్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె నటిస్తున్న గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా, స్కంద, VD12, ఉస్తాద్ భగత్ సింగ్, అల్లు అర్జున్ తో ఆహా కోసం చేసిన ఓ సాంగ్ ఇలా శ్రీలీల బర్త్ డే రోజున సోషల్ మీడియాలో శ్రీలీల ఫస్ట్ లుక్స్ తో హోరెత్తిపోయింది. ఇక ఈరోజు సోమవారం కూడా శ్రీలీల ఇలాంటి రేర్ ఫీటే అందుకుంది.
అది శ్రీలీల నటిస్తున్న బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి నుండి.. RFC లో నేటి నుండి బాలయ్య-కాజల్ అగర్వాల్-శ్రీలీల అలాగే సినిమాలోని కీలక నటులపై భారీ సెట్ లో సాంగ్ చిత్రీకరణ అంటూ భగవంత్ కేసరి మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాన్నానికి నితిన్ తో శ్రీలీల నటిస్తున్న ఎక్స్ట్రా మూవీ నుండి డేంజర్ పిల్ల సాంగ్ ప్రోమో వదిలారు మేకర్స్. ఇక ఇదే రోజు సోమవారం సాయంత్రానికి రామ్ తో శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్కంద మూవీ నుండి అప్ డేట్ వచ్చేసింది. మరి ఒకే హీరోయిన్ నటించిన మూడు సినిమాల నుండి ఒకేరోజు ఇలా మూడు అప్ డేట్స్ రావడం చాలా తక్కువమంది హీరోయిన్స్ కి జరుగుతుంది.
ఈ ఏడాది శ్రీలీల నటిస్తున్న నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో వైష్ణవ తేజ్ ఆదికేశవ ఆగష్టు 18 న విడుదల కాబోతుంది. అలాగే రామ్-బోయపాటి చిత్రం స్కంద సెప్టెంబర్ 15న విడుదలకు సిద్దమవుతుంది. బాలయ్య సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్న భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదలవుతుంది. నితిన్ తో జోడి కడుతున్న ఎక్స్ట్రా మూవీ డిసెంబర్ 23 న విడుదలకు సిద్దమవుతుంది. అందుకే ఈ సినిమాల నుండి అప్ డేట్స్ ఇలా ఒకదానిపై ఒకటి వచ్చి పడుతున్నాయి.