అల్లు అర్జున్-త్రివిక్రమ్ లు కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న ఈ జోడి ఇప్పుడు నాలుగో హిట్ పై కన్నేసింది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కలయికలో భారీ ప్యాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసారు మేకర్స్. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబో సెట్ అవడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, అల్లు అర్జున్ మార్క్ యాక్షన్ కలగలిపిన చిత్రంగా ఇది ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఆలు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ కథలో సోషియో ఫాంటసీ అండ్ ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ పాత్రని కూడా చాలా వినూత్నంగా అంటే ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని విధంగా డిజైన్ చేశాడని అంటున్నారు. అల్లు అర్జున్ సరికొత్తగా ఈ సినిమాలో దర్శనమిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ బాలీవుడ్ హీరోయిన్ నే తీసుకుంటారని తెలుస్తుంది.
అయితే ఈప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఎక్కువ సమయమే పట్టేలా ఉందట. కారణం అల్లు అర్జున్ పుష్ప పూర్తి చేసాక సందీప్ వంగ చిత్రం చెయ్యాల్సి ఉంది. దాని తర్వాతే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సెట్స్ మీదకి వెళతాడని టాక్.