Advertisement
Google Ads BL

ఖుషి ని కాపీ చేసావా నితిన్


పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఖుషి టైటిల్ తో విజయ్ దేవరకొండ-సమంతలు శివ నిర్వాణ దర్శకత్వంలో ఏ చిత్రం విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ఖుషి చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఎప్పుడో హడావిడి మొదలు పెట్టేసారు మేకర్స్. ఖుషి చిత్ర ఫస్ట్ లుక్ లో హోలీ కలర్స్ తో విజయ్ దేవరకొండ-సమంత లు ఎంత క్యూట్ గా కనిపించారో.. ఇప్పుడు అచ్చం అదే కలర్ ఫుల్ పోస్టర్ తో నితిన్ ఎక్స్ట్రా మూవీలో శ్రీలీల తో కలిసి కనిపించడంతో అందరూ ఏంటి నితిను.. విజయ్ దేవరకొండ ఖుషి పోస్టర్ కాపీ కొట్టేశావా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్-శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రానికి ఈ మధ్యనే టైటిల్ రివీల్ చేసారు మేకర్స్, ఎక్స్ట్రా అంటూ టైటిల్ దానికి క్యాప్షన్ గా ఆర్డినరీ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. టోటల్ గా ఎక్సట్రార్డినరీ మ్యాన్ అన్నమాట. అయితే ఈ ఎక్స్ట్రా చిత్రం నుండి సాంగ్ ప్రోమో రేపు వదలబోతున్నాట్టుగా మేకర్స్ పోస్టర్ వేసి ప్రకటించారు. ఆ పోస్టర్ చూడగానే నితిన్-శ్రీలీల క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించిన విజయ్-సమంత ల ఖుషి ఫస్ట్ లుక్ పోస్టర్ వైబ్స్ కనిపించడంతో అందరూ ఖుషి పోస్టర్ కాపీ కొట్టేసారు నితిన్ వాళ్ళు అంటూ కామెంట్  చేస్తున్నారు.

మరి ఎక్స్ట్రా నుండి రేపు డేంజర్ పిల్లా సాంగ్ ప్రోమోని వదలబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చి మేకర్స్ ఇలా దిరికిపోయారంటూ నెటిజెన్స్ కూడా సరదాగా మాట్లాడుతున్నారు.

Nithin Extra movie poster viral:

Nithin Extra movie song promo poster 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs