పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలంటూ ఆయన ఫాన్స్ ఎంతగా రిక్వెస్ట్ చేసారో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చూసాం. పవన్ కళ్యాణ్ రాజకీయాలకన్నా సినిమాలే చెయ్యాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. అటు రాజకీయాలు తో పాటుగా సినిమాలు చేస్తూ ఆ డబ్బుని రాజకీయాలకి మళ్లించే ఉద్దేశ్యంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగైదేళ్లలో చేసిన మూడు చిత్రాలు రీమేక్ లే. అవైతేనే చక చకా పూర్తి చేసి వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ వరసగా మూడు రీమేక్స్ ని సెలక్ట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఒకటి హిందీ మూవీ పింక్ రీమేక్ వకీల్ సాబ్. అది ఎలాగో వర్కౌట్ అయ్యింది. ఆయన రీ ఎంట్రీ తోనే హిట్ కొట్టారు. తర్వాత మలయాళంలో హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ ని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేసారు. అది ఎలాగోలా నడిచేసింది. ఇక మధ్యలో ఎన్నో స్ట్రయిట్ సినిమాలని ఒప్పుకొని, అందులో కొన్ని చిత్రాలు కొంతమేర షూటింగ్ చేసి అవి హోల్డ్ లో పెట్టి మళ్ళీ తమిళ వినోదియం సిత్తం చిత్రాన్ని తెలుగులో BRO గా రీమేక్ చేసి వదిలారు. ఇలా వరసగా మూడు రీమేక్స్.. అవి చూసి ఫాన్స్ కి కూడా మొహం మొత్తేసింది.
అందులోనూ BRO రిజల్ట్ పట్ల వాళ్ళు అంతగా హ్యాపీగా లేరు. అందుకే ఇకపై పవన్ కళ్యాణ్ ఆ రీమేక్స్ పక్కన బెట్టి స్ట్రయిట్, ఒరిజినల్ కథలతోనే సినిమాలు చెయ్యాలని పవన్ కి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ముందు ఒప్పుకున్న స్ట్రయిట్ కథలని పూర్తి చేశాకే మరో సినిమా చెయ్యండి.. అందులో రీమేక్ లు లేకుండా చూసుకోండి అంటూ పవన్ ఫాన్స్ ఆయనకి డైరెక్ట్ గానే రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి పవన్ తన ఫాన్స్ రిక్వెస్ట్ ని పరిగణనలోకి తీసుకుంటారో, లేదో చూద్దాం.