ఒకే పార్టీలో ఉన్న వారు ఒక్కరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం చాల అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడో పార్టీ నుండి వెళ్లిపోదామనుకున్న వాళ్ళే సొంత పార్టీపై కామెంట్స్ చేస్తూ కనిపిస్తారు. తాజాగా వైసీపీ ప్రభుత్వంలో మంచి పొజిషన్ లో కొనసాగుతున్న పోసాని కృష్ణమురళి తాజాగా తమ ప్రభుత్వంలోనే మంత్రిగా కొనసాగుతున్న రోజా భర్త సెల్వమణి పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పోసాని రోజా భర్త సెల్వమణిపై ఎందుకు కామెంట్ చెయ్యాల్సి వచ్చింది అంటే.. తమిళ పరిశ్రమలో కేవలం తమిళులు మాత్రం నటించాలి, తమిళనాడులోనే షూటింగ్ చేయాలి, తమిళ్ వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పలు రూల్స్ ని తీసుకొచ్చారు. తమిళ్ డైరెక్టర్, రోజా భర్త, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడు RK సెల్వమణి ఇలాంటి రూల్స్ ని ప్రవేశపెట్టి పలు వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ BRO ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే అన్ని భాషల నటులు మమేకంతో నడుస్తుంది. తమిళనాట అలాంటి రూల్స్ పెట్టడం సరికాదు అంటూ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా పోసాని ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు తమిళ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాల గురించి మీడియా వారు అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ.. కోలీవుడ్ వాళ్ళు చాలా మంచోళ్ళు, మేము తమిళనాడులో పరిశ్రమ ఉన్నప్పుడు అక్కడ అందరూ మాకు సపోర్ట్ చేశారు. ఇలాంటి నిర్ణయాలు తప్పు. అసలు తమిళులే ముందు ఒప్పుకోరు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్స్ కూడా ఒప్పుకోరు.
అసలు సెల్వమణి ఇప్పుడు యాక్టివ్ గా లేడు, ఆయన కనీసం సినిమాలు తీయట్లేదు. సెల్వమణి అంటే తమిళ పరిశ్రమ అంతా అన్నట్టు కాదు. అది ఎప్పటికీ జరగని పని. మన వాళ్ళు తమిళ సినిమాల్లో చేస్తారు, వాళ్ళు ఇక్కడి సినిమాల్లో చేస్తారు. ఎవరో సెల్వమణి అన్నంత మాత్రాన అది జరిగిపోవు అంటూ పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.