అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప 2 షూటింగ్ లో ఎంతెలా మునిగిపోయారో కానీ.. పుష్ప ద రూల్ నుండి ఎలాంటి అప్ డేట్ బయటికి రాకూండా కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు.. పుష్ప ద రూల్ కోసం అల్లు అర్జున్-సుకుమార్ లు చాలా కష్టపడుతున్నారు.. పుష్ప ద రైజ్ కన్నా పుష్ప ద రూల్ తో మరింత గట్టిగా హిట్ కొట్టడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. ఆ మాట విన్న మిగతా అల్లు ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. అయితే పుష్ప ద రైజ్ లో సమంతతో చేయించిన ఐటమ్ సాంగ్ సూపర్ బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు పార్ట్ 2 లో ఏ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేయబోతున్నారో అంటూ అందరిలో ఆత్రుత మొదలైంది.
అయితే ఇప్పటివరకు పుష్ప 2 ఐటమ్ లో ఆడేందుకు చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా.. తాజాగా పుష్ప ద రూల్ కోసం మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ దిగబోతుంది అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కి లక్కీ బ్యూటీగా మారిన శ్రీలీలతో పుష్ప ద రూల్ లో ఐటమ్ సాంగ్ చేయించాలని మేకర్స్.. ఆమెని సంప్రదించగా.. శ్రీలీల ఇంకా ఐటమ్ సాంగ్ చెయ్యడానికి ఒప్పుకోలేదట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం బిజీగా వున్న శ్రీలీల నిర్ణయం కోసం పుష్ప మేకర్స్ వెయిటింగ్ అంటున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్ సరసన శ్రీలీల యాక్ట్ చేసింది. కానీ అది సినిమా కోసం కాదు. ఆహా ఓటిటీ కోసం అల్లు అర్జున్ తో శ్రీలీల కాలు కదిపింది. డాన్స్ పరంగా బెస్ట్ అనిపించుకుంటున్న శ్రీలీల అయితే అటు క్రేజ్ పరంగాను, ఇటు అల్లు అర్జున్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ కూడా అవుతుంది అని పుష్ప మేకర్స్ భావించి ఆమెని అడిగినట్లుగా తెలుస్తుంది. మరి శ్రీలీల ఏమంటుందో చూడాలి.