సూపర్ స్టార్ రజినీకాంత్ ఎక్కువగా ప్రశాంతతని కోరుకునే వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉండే హీరో.. సినిమాల్లో ఒక స్టేజ్ లోకి వచ్చాక రాజకీయాల్లోకి దిగుదామని భావించిన రజినీకాంత్ కి ఆయన ఆరోగ్యం సపోర్ట్ చేయకపోవడంతో ఆ ఆసక్తిని విరమించుకుని సరదాగా సినిమాలు చేసుకుంటున్నారు. వరస సినిమాలు చేస్తున్నా సూపర్ స్టార్ ని విజయం పలకరించి చాలా రోజులైంది. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 10న విడుదలకు సిద్దమవుతుంది ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జైలర్ ఆడియో లాంచ్ వేదికలో నిన్న శుక్రవారం రాత్రి చెన్నైలో సందడి చేసారు.
అయితే ఈ చిత్రానికి సంబందించిన రజినీ ప్రమోషన్స్ పూర్తి కావడంతో ఆయన హిమాలయాలకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది. బాబా మూవీ సమయం దగ్గర నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎక్కువగా హిమాలయాలకు వెళ్లి కొద్దిరోజులు అక్కడ గడిపి మళ్ళీ నూతన ఉత్సాహంతో తిరిగి వస్తూ ఉంటారు. తాజాగా రజినీకాంత్ మరోమారు హిమాలయాల ప్రయాణం పెట్టుకున్నారని తెలుస్తుంది. అక్కడే కొన్నాళ్ళు ధ్యానముద్రలో మునిగి యాక్టీవ్ గా వస్తారని అంటున్నారు.
అలాగే ప్రతి ఏడాది సూపర్ స్టార్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళుతూ ఉంటారు. అక్కడ రెగ్యులర్ బాడీ చెకప్స్ చేయించుకుని ఆయన తిరిగి చెన్నైకి వస్తారు. ఇక ప్రతి ఏడాది కొన్నాళ్లపాటు హిమాలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు.