అనుష్క బాహుబలి, భాగమతి తర్వాత పబ్లిక్ లో చాలా అరుదుగా దర్శనమిస్తుంది. అసలు సినిమాలే కాదు.. ఆమె ఏ ఈవెంట్ లోను కనిపించడమే లేదు. ప్రస్తుతం మిస్సెస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తుంది అని ఎదురు చూస్తున్న ఆమె అభిమానులకి ఆ సినిమా మేకర్స్ అడుగడునా షాకిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం తేదీల మీద తేదీలు మార్చుకుంటూ ఇప్పుడు ఆగష్టు మొదటి వారంలో కూడా విడుదల చెయ్యడం లేదు అంటూ మేకర్స్ మరోసారి సారి చెబుతున్నారు.
సరే ఆ సినిమా అలా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇటు చూస్తే అనుష్క ఈ చిత్రం తర్వాత ఇక సినిమాలకి గుడ్ బై చెప్పెయ్యబోతుంది. ఆమె బరువు తగ్గించుకోవడంలో వరసగా విఫలం అవుతున్న కారణంగానే ఆమె ఇకపై సినిమాల నుండి తప్పుకోవాలనుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. కేవలం బరువు తగ్గకపోవడం వలనే అనుష్క బయట పబ్లిక్ లో కనిపించడం లేదు. ఇప్పుడు సినిమాలు వదిలెయ్యడానికి కారణం కూడా అదేనంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె ఆయుర్వేద చికిత్స తీసుకున్నా, యోగ చేసినా.. ఇతర ట్రీట్మెంట్ తీసుకున్నా బరువు విషయంలో ఏ మాత్రం మార్పు రాలేదు.
దానితో ఆమె ఇకపై సినిమాలు చెయ్యకూడదు అనుకుంటుందట. మరి ఇందులో నిజమెంతుందో అనేది అనుష్క స్పందిస్తేనే కానీ తెలియదు. కానీ అనుష్క సినిమాలకి గుడ్ బై చెప్పెయ్యబోతుంది అనే న్యూస్ చూసాక ఆమె అభిమానులు చాలా ఫీలైపోతున్నారు.