Advertisement
Google Ads BL

పవన్ డైలాగ్ ఆయనకే తగిలిందా?


పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా చాలా స్పీడు మీదున్నారు. జనసేన పార్టీ పెట్టాక ఆయన ఎంతగా ప్రజల్లోకి వెళ్లినా పవన్ గ్రాఫ్ అంతగా పెరగలేదు కానీ.. ఈసారి పవన్ గ్రాఫ్, పవన్ అలజడి ఏపీ రాజకీయాల్లో స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ని బీజేపీ, టీడీపీ తో కలవకుండా చేసేందుకు వైసీపీ వాళ్ళు నానా పాట్లు పడుతున్నారు. ప్యాకేజి స్టార్, మూడు పెళ్లిళ్లు అంటూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ వాళ్ళని ఓ ఆటాడుతున్నారు. వాళ్ళని ఊపిరి తీసుకోకుండా డైలాగ్స్ వేస్తున్నారు. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా వైసీపీ మంతులు, నేతలు పవన్ పై పడిపోతున్నారు.

Advertisement
CJ Advs

అయితే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే కాదు ఇండైరెక్ గా వైసీపీ మంత్రులను చెడుగుడు ఆడుకుంటున్నారు అనేలా ఆయన లేటెస్ట్ ఫిల్మ్ BRO లో కొన్ని డైలాగ్స్ పేలాయి. త్రివిక్రమ్ కూడా తన ఫ్రెండ్ కోసమే ఈ డైలాగ్ రాశారా అనేలా ఉందో డైలాగ్. ముఖ్యంగా అంబటి రాంబాబుపై పవన్ ఇండైరెక్ట్ డైలాగ్స్ వేసారంటూ జనసేన నేతలు, మిగతా వారు చర్చించుకుంటున్నారు. BRO లో ఓ పబ్ సీన్ ఉంటుంది. ఆ పబ్ సీన్‌లో సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తుంటారు. అదే సీన్‌లో అమ్మాయిల పిచ్చి ఉన్న శ్యాంబాబు ( పృథ్వీ) కూడా నాన్ సింక్‌లో మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తుంటాడు. పక్కనే డాన్స్ చేసున్న పవన్ కల్యాణ్ పృథ్వి అలియాస్ శ్యాంబాబు ని ఉద్దేశించి.. ప్లే అవుతున్న మ్యూజిక్ ఏమిటి? నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? అంటూ సీరియస్ అవుతాడు.

అయితే బ్రో లోని శ్యాంబాబు ఎపిసోడ్ కి సంక్రాంతి పండుగ సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఓ వేడుకలో రోడ్డు మీద వేసిన డాన్స్ తో పోలుస్తున్నారు. ఆ రోజు మంత్రి అంబటి వేసిన డ్రస్సు లాంటి  డ్రస్సును శ్యాంబాబుకు వేయడంతో ఇప్పుడా సీన్ వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్‌ను కట్ చేసి.. శ్యాంబాబు వేసిన స్టెప్పుల వీడియోను, అంబటి రాంబాబు వేసిన వీడియోను మిక్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ కామెడీ మీమ్స్ చేస్తున్నారు. మరి ఈ డైలాగ్స్ పై అంబటి మరియు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Ambati Rambabu s Shyam Babu?:

Trivikram Political Touch To Pawan Bro!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs