చిన్న మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సాయి రాజేష్ బేబీ మూవీ నిన్నటివరకు కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులని క్రియేట్ చేసింది. చాలా తక్కువ బడ్జెట్ తో SKN తెరకెక్కించిన బేబీ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం థియేటర్స్ లో సర్ ప్రైజ్ నెంబర్లు నమోదు చేసింది. బేబీ మూవీ BRO వచ్చేవరకు ఎదురు లేకుండా పోయింది. అలాగే థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ కొల్లగొడుతున్న బేబీ మూవీని ఇప్పుడప్పుడే ఓటిటిలో కూడా విడుదల చేయరని అన్నారు.
బేబీ మూవీకి మెగా కంపౌంట్ అండ ఉంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి బేబీ దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKN ని సత్కరించారు. అదలా ఉంటే బేబీ ఆడియన్స్ కి మేకర్స్ మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కొత్త సాంగ్ ని యాడ్ చేస్తున్నట్టుగా దర్శకుడు కన్ఫర్మ్ చేయగా దీనితో పాటుగా టోటల్ గా మరో 14 నిమిషాలు నిడివి అదనంగా యాడ్ చేయబోతున్నారట. కొత్త సన్నివేశాలు కలిపిన డైరెక్టర్ కట్ తో బేబీ సినిమా ఈ ఆగస్ట్ నుంచి అందుబాటులో ఉండనుంది అని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ అనౌన్సమెంట్ రావాల్సి ఉంది.