కోలీవుడ్ హీరో విశాల్ నయనతారపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం విశాల్ విజయం కోసం శ్రమిస్తున్నాడు. డిటెక్టీవ్, అభిమన్యుడు చిత్రాల తర్వాత వరస వైఫల్యాలతో సతమతమవుతున్న విశాల్ ఇప్పుడు మార్క్ ఆంటోనితో ఆడియన్స్ ముందుకు వచ్చెందుకు రెడీ అవుతున్నాడు. మార్క్ ఆంటోని చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయనని మీడియా ఓ ప్రశ్న అడిగింది. నయనతార సినిమా ప్రమోషన్స్ కి ఎందుకు రాదు.. కారణం ఏమిటి.. సినిమాల్లో నటించడం వరకే ఆమె వంతు.. తర్వాత ప్రమోషన్స్ లో ఎందుకు కనిపించదు అని అడిగారు.
దానికి విశాల్ నయనతార ఏ చిత్ర ప్రమోషన్స్ లోను పాల్గొనదు. అది ఆమె వ్యక్తిగత సమస్య. హక్కు కూడా. ఖచ్చితంగా మీరు ప్రమోషన్స్ లో కనిపించాలనే నిబంధన పెట్టలేము. నిర్బంధము చేయలేము. ప్రమోషన్స్ లో పాల్గొనడం తనకి ఇష్టం లేదు.. రాను అని చెబితే మనం ఏమి చేయలేము.. కానీ ఆమె ప్రమోషన్స్ లో కనిపిస్తే బావుంటుంది అంటూ విశాల్ నయన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో నయనతార విశాల్ తో కలిసి సినిమా చేసింది.
నిజంగానే విశాల్ చెప్పడం, మీడియా అనడం కాదు కానీ.. సినిమాకి కోట్లకి కోట్లు పారితోషకం తీసుకుంటుంది.. ఆ చిత్ర ప్రమోషన్స్ లో మాత్రం కనిపించదు. ఆమె నటించిన చిత్రాన్ని ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే ఆడియన్స్ లో, అభిమానుల్లో మరికాస్త క్రేజ్, హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ఆమె మాత్రం.. తనకి సెంటిమెంట్ అందుకే ఏ చిత్ర ప్రమోషన్ కి వెళ్ళను అని తెగేసి చెబుతుంది.