మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరు భోళా శంకరుడిగా ఆగమనానికి కావల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తమన్నాతో డ్యూయెట్, కీర్తి సురేష్ తో ఫ్యామిలీ సాంగ్, నిన్న శుక్రవారం విడుదలైన భోళా శంకర్ ట్రైలర్ అన్ని భోళా మ్యానియాలో భాగమే. అయితే రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మొత్తం యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాదిరి కనిపించినా.. అందులో మెగాస్టార్ లుక్ విషయంలో, డైలాగ్స్ విషయంలో మాత్రం బోలెడన్ని కామెంట్స్ పడుతున్నాయి.
అందులో ముఖ్యంగా మురళి శర్మని మెగాస్టార్ అంకుల్ అని సంభోదిస్తూ.. లేదు అంకుల్, యాపిలీస్ కాయ తింటున్నాను.. అనడం, నీ వెనుక మాఫియా ఉంటే, నా వెనుక దునియా ఉందీ బే అంటూ మెగాస్టార్ పలకడమే కాదు.. యంగ్ లుక్స్ లో కనిపించడానికి ట్రై చేసి నవ్వులు పాలయ్యారంటున్నారు. వేదాళం సినిమాని యాజిటీజ్ గా దించేవారు, అసలు భోళా శంకర్ ట్రైలర్ చూస్తున్నంతసేపు.. వేదాళం అందులోను అజిత్ మాత్రమే గుర్తుకొచ్చాడు.. ఎందులోనూ మెగాస్టార్ కనిపించలేదు అంటూ కామెడీ చేస్తున్నారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని మెగాస్టార్ ట్రై చేసారు. పవన్ సినిమాలో చిరు డైలాగ్స్, చిరు సినిమాలో పవన్ డైలాగ్స్.. ఇలా ఎన్నాళ్ళు చేస్తారు అనే కామెడీ మరోవైపు. మెగా ఫాన్స్ కి మెగా ప్యాకేజ్ భోళా శంకర్ ట్రైలర్.. కానీ మిగతా ఆడియన్స్ మాత్రం ఈ భోళా శంకరుడుని ఆడుకుంటున్నారు. చిరు ఇంకెన్నాళ్లు ఇలా గ్లామర్ భామల పక్కన డాన్స్ చేస్తావ్, ఇంకెన్నాళ్లు ఫైట్స్ అంటూ లాక్కొస్తావ్.. ఇకనైనా మంచి కథలను ఎంచుకుని వయసుకి తగిన పాత్రలు చేస్తూ ముందుకు సాగిపో అంటూ సలహాలు పారేస్తున్నారు.. ఇదేనన్నమాట భోళా జీ ! బోలో జీ!