Advertisement

సినీజోష్ రివ్యూ: BRO


సినీజోష్ రివ్యూ: BRO 

Advertisement

బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్

నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, ఊర్వశి రౌతేల్ల(స్పెషల్ సాంగ్), బ్రహ్మానందం, వెన్నెల కిషోర్  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్ 

ఎడిటింగ్: నవీన్ నూలి

స్క్రీన్ ప్లే-డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ 

నిర్మాతలు: టీ.జి విశ్వ ప్రసాద్ , వివేక్ కూచిబొట్ల 

దర్శకత్వం:  సముద్రఖని 

రిలీజ్ డేట్: 28-07-2023

కోవిడ్ టైమ్ లో..  లిమిటెడ్ బడ్జెట్ తో.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా రూపొందిన వినోదాయ సిత్తం అనే తమిళ చిత్రాన్ని తెచ్చి ఏకంగా పవర్ స్టార్ తో రీమేక్ చేస్తున్నారని తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు.. అభిమానులైతే హాహాకారాలు చేసారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ లబోదిబోమంటున్నా, వద్దు బాబో అంటున్నా పవన్ పట్టించుకోలేదు. త్రివిక్రమ్ స్పందించలేదు. చటుక్కున సెట్స్ పైకి వెళ్ళిపోయి, చకచకా షూటింగ్ చేసేసుకుని BRO అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసాక కాస్త చలనం కనిపించింది ట్రేడ్ లో.!

పవన్ కళ్యాణ్ స్టయిలింగ్, వింటేజ్ టచ్ ఫాన్స్ లో ఆశలు పుట్టించింది.

కాలం - ఇంద్రజాలం అంటూ  త్రివిక్రమ్ కలం కాస్త హోప్ రప్పించింది.

తమన్ ఎంతో తపన పడి చేసిన థీమ్ సాంగ్ BRO పై భరోసా కల్పించింది.

ఇంటర్వూస్ లో టీమ్ కాన్ఫిడెన్స్ సినిమాలో విషయం ఉందనిపించింది.

పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ హై జనరేట్ కాకపోయినా.. రిలీజ్ టైమ్ కి రీజనల్ బజ్ తెచ్చేసుకున్న BRO నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ముందు సినిమా ఎలా ఉందో చెప్పేసుకుందాం.. ఆపై అందులోని లోటుపాట్లు చర్చించుకుందాం. పదండిక కాలం నడిపిన  కథలోకి..!

BRO స్టోరీ: 

ప్రతి కుటుంబంలో ఉండే కథే ఈ BRO. ఇంటికి పెద్ద కొడుకుగా ఉండేవారు ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూ .. తమ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు సెటిల్ అవ్వాలని.. తన ఫ్యామిలీ మంచి పొజిషన్ లో ఉండాలి కోరుకున్నట్టుగానే మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) కూడా సగటు అన్నగా కోరుకుంటాడు. తండ్రి మరణం తర్వాత ఇంటి బాధ్యతలు భుజాన ఎత్తుకుని తనతో పాటుగా తన కుటుంబం కూడా ఉన్నతంగా స్థిరపడాలని కాలంతో పరుగులు పెడుతూ ఉంటాడు. అంతలా కష్టపడుతున్న మార్కండేయులకి ఊహించని ప్రమాదం జరుగుతుంది. కానీ కుటుంబం స్థిరపడకుండానే తనని తీసుకుపోతున్నాడంటూ అతను కాలమనే దేవుడిని(పవన్ కళ్యాణ్) ని వేడుకుంటాడు. దానితో కాలం మార్కండేయులుకి కొద్ది నెలల సమయం ఇస్తుంది. మరి మార్కండేయులు ఆ కొద్ది నెలల సమయాన్ని ఉపయోగించుకుని ఫ్యామిలీని స్థిరపరిచాడా.. ఈ క్రమంలో కాలం(పవన్) తో అతని అనుభవం ఏమిటి అనేది బ్రో పూర్తి కథ.

BRO స్క్రీన్ ప్లే:

బేసిక్ గానే షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఇది. దాన్ని సముద్రఖని కాస్త పెంచుకుని 90 నిముషాల నిడివితో వినోదాయ సిత్తం చేసుకుంటే త్రివిక్రమ్ తన చిత్తానికి ఆ సిత్తాన్ని మార్చేస్తూ.. 130 నిముషాల నిడివికి పెంచేస్తూ BRO ని షేప్ అప్ చేసారు. ఆ ప్రాసెస్ లో పవన్ ఫ్యాన్స్ కి నచ్చుద్దనే మెటీరియల్ మిక్స్ చేశారు తప్ప అంత లెంగ్త్ కి సరిపడే స్ట్రెంగ్త్ ని మాత్రం స్క్రిప్ట్ లో ఫిక్స్ చేయలేదు. దాంతో ఫస్టాఫ్ ఫాస్ట్ గానే కదిలినా.. సెకండాఫ్ స్మూత్ గానే సాగినా ఓవరాల్ గా ఫ్లాట్ గా అనిపించే సినిమా అయిపొయింది BRO. ఎంటర్ టైన్ చేసే సీన్స్ చాలా ఉన్నప్పటికీ అవి ఫ్యాన్స్ కోసమే అన్నట్టు ఉంటాయి. కనెక్ట్ అయ్యే డైలాగ్స్ కొన్ని ఉన్నప్పటికీ అవి కన్వీనియంట్ గా రాసినట్టు ఉంటాయి. వెరసి పవన్ ఫ్యాన్సే కాదు.. స్వయంగా పవన్ కూడా అత్యంత అభిమానించే గురూజీ మరోమారు తీన్ మార్ గుర్తు చేయగలిగారు తప్ప గొప్పగా ఏమీ చేయలేదు BRO.!

BRO ఎఫర్ట్స్: 

పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్, ఆయన డైలాగ్స్ అన్ని ఫాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయి. దేవుడు భక్తుడు లాంటి కాన్సెప్ట్ మూవీస్ లో దేవుడు కొన్ని సీన్స్ కే పరిమితం అవుతూ ఉంటాడు కానీ.. ఇక్కడ పవన్ ముందే చెప్పినట్లు దాదాపు 80 శాతం తెరపై కనువిందు చేస్తారు. పవన్ స్టైల్, స్వాగ్, ఎనర్జీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయి. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబో సీన్స్ అభిమానులకి ఫుల్ ట్రీట్ అనేలా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ కొన్ని సన్నివేశాలలో కాస్త బొద్దుగా అవుట్ అఫ్ షేప్ లో కనిపించాడు. కాకపోతే ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ కేతిక శర్మ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆమె లుక్స్ పరంగా బావుంది. ప్రియా ప్రకాష్ వారియర్, సుబ్బరాజు, బ్రహ్మి, వెన్నెల కిషోర్.. ఇలా  మిగిలిన యాక్టర్స్ అందరూ చిన్న చిన్న రోల్స్ లో ఓకే అనిపిస్తారు… 

పాటల విషయంలో తమన్ నిరాశ పరిచినా.. BRO థీమ్ సాంగ్ అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉండగా.. ప్రొడక్షన్ వాల్యూస్ వీక్ గా ఉన్నాయి, VFX వర్క్ పూర్ ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఫస్టాఫ్ లో పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో డ్రాగ్ అయ్యింది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సముద్రఖని చెప్పిన కథ ఆల్రెడీ అందరికీ పరిచయం ఉన్న కథనే.. దానికి పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్, సాంగ్స్ తో ఫ్యాన్స్ ని అయితే శాటిస్ ఫై చేయగలిగాడు కానీ.. కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఫ్యూ ను అంతగా మెప్పించలేకపోయాడు.

BRO ప్లస్ పాయింట్స్ :

పవర్ స్టార్

పవన్ 

కళ్యాణ్ 

BRO మైనస్ పాయింట్స్:

స్మాల్ స్టోరీ

సో సో డైలాగ్స్

సోల్ లెస్ స్క్రీన్ ప్లే

BRO ఎనాలసిస్:

పవన్ మ్యానియాకి తగ్గట్టు మలిచే క్రమంలో కాలం పాత్ర కదంతొక్కింది.. కానీ కథనం మాత్రం పక్కదారి పట్టింది. పవన్ మార్కెట్ కి తగ్గట్టు సినిమాని విస్తరించే ప్రయత్నంలో వింటేజ్ థింగ్స్ ఎక్కువయ్యాయి. కథకి కావాల్సిన అసలైన అంశాలు అదృశ్యమయ్యాయి. పవర్ స్టార్ అనే బ్రాండ్ తో పవర్ ఫుల్ ఓపెనింగ్స్ తెప్పించుకున్న ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ వరకు ప్రేక్షకుల కొరత ఉండదు కలెక్షన్స్ కి తిరుగుండదు. కానీ వీక్ డే స్టార్ట్ అవ్వగానే సినిమాలోని వీక్ పాయింట్సే BRO రన్ కి అడ్డం పడేలా ఉన్నాయి. మరీ అవరోధాన్ని కూడా అధిగమించాలంటే మళ్ళీ పవన్ మ్యాజిక్ పనిచేయాల్సిందే. తన పవర్ ఏంటో చూపించాల్సిందే. చూద్దాం.. కాలం చేసే ఇంద్రజాలాన్ని ఈ టైం గాడ్ కి దక్కే ఫైనల్ రిజల్ట్ ని!

పంచ్ లైన్: సో సో BRO 

రేటింగ్: 2.5/5

Cinejosh Review: BRO:

BRO Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement