Advertisement
Google Ads BL

పూజ హెగ్డేకి మరో హీరోయిన్ చెక్


హీరోయిన్ పూజ హెగ్డే పరిస్థితి రోజు రోజుకి అగమ్య గోచరంగా తయారవుతుంది. ఇప్పటికే మహేష్ గుంటూరు కారం మూవీ చేజారిపోయి బాధపడుతున్న పూజ హెగ్డే కి శ్రీలీల ఎప్పుడో చెక్ పెట్టేసింది. శ్రీలీల మెల్లగా టాలీవుడ్ లో జెండా పాతేసింది. ఆ దెబ్బకి పూజ హెగ్డే ని పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. సర్లే గోపీచంద్ మలినేని, రవితేజ కోసం పూజ హెగ్డే ని హీరోయిన్ గా సెలెక్ట్ చెయ్యబోతున్నారు.. కనీసం ఈ ఛాన్స్ అయినా వస్తే పూజ హెగ్డే కి వస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

తన లక్కీ చార్మ్ శృతి హాసన్ ని గోపీచంద్ పక్కనపెట్టి మరీ పూజ హెగ్డే ని తీసుకుంటున్నారు అనే న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇప్పుడిప్పుడే మెల్లగా టాలీవుడ్ లో చొచ్చుకుపోతున్న సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా పూజ హెగ్డే కి  ఝలక్ ఇచ్చేందుకు సిద్దమయ్యింది అని చెప్పుకుంటున్నారు. సీతారామం తర్వాత నాని తో హాయ్ నాన్నా, విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో హీరోయిన్ గా ఈమధ్యనే సెట్స్ లోకి ఎంటర్ అయిన మృణాల్ ఠాకూర్ కి రామ్ చరణ్-బుచ్చి బాబు సినిమాలో కూడా ఛాన్స్ రాబోతుంది అనే న్యూస్ కూడా ఉంది.

ఈలోపులో గోపీచంద్ మలినేని-రవితేజ కలయికలో తెరకెక్కబోయే మూవీలోను పూజ హెగ్డే ని పక్కబెట్టి మృణాల్ ఠాకూర్ అయితే బావుంటుంది అని మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పూజా హెగ్డే కి మృణాల్ డైరెక్ట్ గా చెక్ పెట్టినట్లే కదా!

Another heroine check for Pooja Hegde:

Mrunal Thakur VS Pooja Hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs