Advertisement
Google Ads BL

బ్రో ఓవర్సీస్ టాక్


పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల బ్రో రెండు తెలుగు రాష్ట్రాల వర్షాలని లెక్క చెయ్యకుండా నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో బ్రో మూవీ షోస్ పూర్తవడమే కాదు.. హైదరాబాద్ IMAX లో ప్రెస్ ప్రీమియర్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావొస్తున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ హీరోయిన్స్ గా కనిపించిన మూవీలో ఊర్వశి రౌతేల్ల స్పెషల్ సాంగ్ లో కనిపించింది. USలో ప్రీమియర్ల తర్వాత ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందంటే.. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ లో చితక్కొట్టేశారని పవన్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. మూవీ లవర్స్‌కు డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ కి అద్దంలో చూపించే సీన్. జీవితం గురించి చెప్పే విషయాలు అదిరిపోయాయని, పవన్ కల్యాణ్ సింగిల్ హ్యాండెడ్‌ పెర్ఫార్మెన్స్.. ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేసాడు. బ్రో సెకండాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్లు, బోరింగ్ సీన్లు ఇబ్బంది పెట్టాయంటున్నారు. అయితే సినిమా ఫ్లాట్‌గా ఉంది. త్రివిక్రమ్ మరోసారి రీమేక్‌ను హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యాడు. ఎమోషన్స్ అస్సలు వర్కవుట్ కాలేదు. స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉంది. బీజీఎం అదిరిపోయింది అంటూ కొంతమంది స్పందిస్తున్నారు.

పవన్ ఇంకా సాయి ధరమ్ ఇద్దరూ స్క్రీన్ మీద ఎనర్జటిక్‌గా ఉన్నారు. ఫ్యాన్స్‌ కి ఫుల్ ఫీస్ట్. ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు అని కొందరు, బ్రో సినిమాను పవన్ కల్యాణ్ కోసం ఓ సారి చూడొచ్చు. కొన్ని సీన్లు పిల్లలు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. స్టోరి కొంత బాగుంది అని కొందరు ట్వీటేశారు. ఓవరాల్‌గా జనరల్ ఆడియెన్స్ ఫస్టాఫ్ గుడ్. పీకే ఫ్యాన్స్‌కు మాత్రం పూనకాలు ఉంటుంది. బ్రో సినిమా స్ట్రిక్టుగా పీకే ఫ్యాన్స్ కోసమే. పవన్ వింటేజ్ మాషప్ సాంగ్స్‌కు విజిల్స్ పడాల్సిందే.. అంటూ ఓవరాల్ గా ఆడియన్స్ బ్రో కి తమ స్పందనని తెలియజేసారు.

Bro overseas talk:

Pawan Kalyan Bro overseas public talk 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs