గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా.. పర్సనల్ లైఫ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమె ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసాక తరచూ బేబీ బంప్ ఫొటోస్ షేర్ చెయ్యడమే కాదు.. తాను ఎవరితో రిలేషన్ లో ఉందో చెప్పడానికి చాలా సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఫైనల్ గా ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లుగా రివీల్ చేసింది. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లికావడం పట్ల నెటిజెన్స్ రకరకాలుగా స్పందించారు. ఏది లెక్క చెయ్యకుండానే ఇలియానా తన రిలేషన్ ని బహిర్గతం చేసింది.
అయితే తాజాగా ఇలియానా నిండు గర్భిణిగా దర్శనమిచ్చింది. తొమ్మదినెలల ప్రెగ్నెంట్ లేడీగా ఇలియానా కనబడింది. ఎప్పుడూ నాజుగా కనిపించే ఇలియానా తన తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీలో బరువుగా దర్శనమిచ్చింది. మిర్రర్ సెల్ఫీతో ఇలియానా చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. అయితే ఈమధ్యన తాను ప్రెగ్నెంట్ తో ఏమి పని చేయలేకపోతున్నాను, సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాను, కానీ ఈ ప్రెగ్నెన్సీని చాలా ఆనందంతో ఆస్వాదిస్తున్నాను అంటూ చెప్పిన ఇలియానా.. ఈరోజు పోస్ట్ చేసిన పిక్ తో పాటుగా మై లిటిల్ అంటూ క్యాప్షన్ పెట్టింది.
మరి నిజంగా ఇలియానాని ఎప్పుడూ గ్లామర్ గా, నాజూగ్గా చూసిన వారు ఇలా ఎప్పుడూ చూసి ఉండరు. మరి చాలా త్వరలోనే ఇలియానా తనకి పాప పుట్టిందో.. లేదంటే బాబు పుట్టాడో అనే శుభవార్తని అభిమానులకి అందించడం ఖాయంగా. అది ఎంత త్వరగా వింటామో అని ఆమె అభిమానులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు.