అనసూయకి చిన్న గ్యాప్ వచ్చినా చాలు వెకేషన్స్ కి వెళ్ళిపోతుంది. తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. సమ్మర్ లో భర్త భరద్వాజ్, పిల్లలతో కలిసి ట్రిప్ వేసిన అనసూయ.. వాళ్లతో కలిసి స్విమ్ చెయ్యడం, బ్రేక్ ఫాస్ట్ ని ఆస్వాదించడం అన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత అనసూయ భర్త తో కలిసి యానివర్సరీ సెలెబ్రేషన్స్ కోసం థాయిలాండ్ వెళ్ళింది. అక్కడ థాయ్ సముద్రపు ఒడ్డున చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇక అక్కడి నుండి వచ్చాక విమానం ప్రమోషన్స్, పుష్ప 2 షూటింగ్స్ అంటూ బిజీ అయ్యింది. ఇప్పుడు పుష్ప ద రూల్ షూటింగ్ నుండి కాస్త గ్యాప్ రావడంతో అనసూయ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా చెక్కేసింది. Having family time to reflect on your time away is the best ♥️🧿 #GoldenGateBridge #GhiradelliSquare #California అంటూ తన భర్త పిల్లలతో కలిసి అనసూయ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని షేర్ చేసింది. అక్కడ ఐస్ క్రీమ్ తింటూ రచ్చ చేసింది.
సోలోగా, భర్త భరద్వాజ్ తో కలిసి, అలాగే భర్త పిల్లలతో, పిల్లలతో అనసూయ ఇచ్చిన ఫోజులు వైరల్ గా మారాయి. ఫ్యామిలీతో ఉన్నా పద్దతిని పక్కనబెట్టి గ్లామర్ చూపించే అనసూయ.. తాజా ఫొటోస్ లో మాత్రం చక్కగా కనిపించింది. ప్రస్తుతం యాంకరింగ్ జాబ్ వదిలేసి ఫుల్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పైనే దృష్టి పెట్టింది. పలు ప్యాన్ ఇండియా మూవీస్ తో పాటుగా.. ఇంట్రెస్టింగ్ మూవీస్ లో నటిస్తూ.. ఇలా షూటింగ్స్ కి బ్రేక్ తగిలినప్పుడల్లా వెకేషన్స్ అంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.