Advertisement
Google Ads BL

అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ప్రభాస్


ప్రభాస్ ఇండియాని వదిలి దాదాపు 50 రోజులవుతుంది. ఆయన ఇక్కడ హైదరాబాద్ లో కనిపించి అర్ధసెంచరీ పూర్తవుతుంది. ఆదిపురుష్ మూవీ విడుదలకు ముందే ప్రభాస్ యుఎస్ ట్రిప్ కి వెళ్లిపోయారు. అక్కడే లాంగ్ ట్రిప్ లో ఉన్న ప్రభాస్ రీసెంట్ గా ప్రాజెక్ట్ K టైటిల్ లాంచ్ లో పాల్గొన్నారు.  కమల్ హాసన్-నాగ్ అశ్విన్ లతో ప్రభాస్ సందడి చేసారు. అయితే ప్రభాస్ అమెరికాలో నెలన్నరకి పైగానే ఉన్నారు. తాజాగా ఆయన అమెరికా నుండి ఇండియాకి రాబోతున్నారని.. ఇకపై సలార్ కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అలాగే మారుతి సినిమా షూటింగ్ లో లో కూడా జాయిన్ అవుతారని సమాచారం. అయితే ఈరోజు ప్రభాస్ మ్యూజిక్ డైరెక్ట్ కళ్యాణ్ మాలిక్ ని హాగ్ చేసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డార్లింగ్ తో కళ్యాణ్ మాలిక్ అంటూ ఫాన్స్ దానిని ట్రెండ్ చేస్తున్నారు. ఆదిపురుష్ కాంట్రవర్సీ  తర్వాత ప్రభాస్ ఇండియాలో కాలు పెట్టడమే ఇదే మొదటిసారి. ఆయన నటిస్తున్న సలార్ ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలున్నాయి. సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీసు ని షేక్ చెయ్యడం ఖాయమంటూ ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Prabhas completes half century:

Prabhas returns to India after a long trip
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs