Advertisement
Google Ads BL

ధనుష్ సినిమాలో మన్మధుడు


లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల ధనుష్ కి కథ చెప్పి ఓకె చేయించుకున్నారు. అది రెండేళ్లయినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఒకొనొక సమయంలో శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబినేషన్ మూవీ ఆగిపోయింది అన్నారు. తాజాగా ధనుష్ తో శేఖర్ కమ్ముల మూవీపై ఓ న్యూస్ బయటికొచ్చింది. శేఖర్ కమ్ముల ధనుష్ చిత్ర స్క్రిప్ట్ కోసం రెండేళ్లకు పైగా సమయం తీసుకుని ఫైనల్ గాని దానిని మల్టీస్టారర్ గా మార్చారనే న్యూస్ వైరల్ గా మారింది. ఆ చిత్రం భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా మార్కెట్ కి సరిపోయేలా శేఖర్ కమ్ముల ప్లాన్ చేశారట. 

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారట మొన్నీమధ్యన ఆయన హిందీ బ్రహ్మాస్త్రలో కూడా నటించారు. ఇప్పుడు ధనుష్ తో శేఖర్ కమ్ముల్ తెరకెక్కించబోయే చిత్రంలోనూ స్పెషల్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన నటించేందుకు మేకర్స్ హీరోయిన్ రష్మిక తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. రష్మిక గనక ఓకె అంటే ఆమెకి నిజంగా ఇది లక్కీ ఛాన్స్ అంటున్నారు. ఇక ధనుష్ తో నాగార్జున సినిమా చెయ్యడానికి గ్రీన్ సింగ్నల్ ఇచ్చారని తెలియగానే అక్కినేని ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. 

ఎందుకంటే నాగార్జున కొత్త సినిమా కబురు వినిపించక చాలా రోజులు అవడంతో వారు డిస్పాయింట్ మోడ్ లోకి వెళుతున్నారు. ఇక శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది అని ఈ చిత్రం కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా AR రెహ్మాన్ ని ఎంపిక చేసుకున్నట్లుగా టాక్.

Nagarjuna - Dhanush Multi starrer film is confirmed:

Nagarjuna makes guest appearance in Dhanush Sekhar Kammula Pan India project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs