Advertisement
Google Ads BL

షూటింగ్ కి బ్రేక్: రిలాక్స్ మోడ్ లో సామ్


సమంత ఏకంగా ఏడాది పాటు కనిపించదు, షూటింగ్స్ లో ఆమె సందడి వినిపించదు అంటూ సామ్ అభిమానులు చాలా బాధపడిపోతున్నారు. ఖుషి సెప్టెంబర్ 1 న విడుదల కాబోతుండగా.. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సీరీస్ విడుదల ఇప్పుడప్పుడే ఉండేలా కనిపించడం లేదు. ఇక ఖుషి తర్వాత మళ్ళీ సామ్ ని ఎప్పుడు చూస్తామో అని అభిమానులు కలవరిస్తున్నారు. కానీ సమంత మాత్రం సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంది. ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి కాగానే యోగా కార్యక్రమానికి వెళ్లి రిలాక్స్ అయ్యి ధ్యానముద్రలో కనిపించిన సమంత తర్వాత బాలిలో తేలింది.

Advertisement
CJ Advs

బాలి లో సమంత ఫుడ్ తింటూ.. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ రిలాక్సింగ్ మోడ్ లో కనబడింది. తన ఫ్రెండ్ తో కలిసి సమంత బాలిలో మార్నింగ్ వాక్ చెయ్యడం, అక్కడే వర్కౌట్స్ చేస్తూ హడావిడి చేయడంతోనే సమంత గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాలిలో సమంత సరదాగా కనిపించింది. అంతేకాకుండా వర్కౌట్స్ చేస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇక ఆమె ఫాన్స్ మాత్రం హెల్త్ గురించి షూటింగ్స్ పక్కనబెట్టి.. ఇలా రిలాక్స్ అవుతుంది. ఆమె ఆరోగ్యపరమైన కారణాలతోనే షూటింగ్స్ కే దూరమైంది అనే వార్త వినిపిస్తుంది.

ఇక ఖుషి కి సంబందించిన డబ్బింగ్ పనులు, ప్రమోషన్స్ చేసేసి సమంత అమెరికా ప్రయాణం పెట్టుకోబోతుందట. అక్కడే సమంత ఆరు నెలలు ఉండి తన హెల్త్ విషయంలో కేర్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.

Samantha Goes For Morning Walk In Bali:

Samantha is currently on a holiday with her friend in Bali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs