Advertisement
Google Ads BL

బాలయ్య నోటి వెంట పవర్ ఫుల్ డైలాగ్


కోనేళ్ళుగా బాలయ్య నోటి నుంచి వస్తున్న డైలాగ్స్ కి నందమూరి అభిమానులకి పూనకాలే అన్నట్టుగా ఉంది వ్యవహారం. సింహ, లెజెండ్, అఖండ, వీర సింహ రెడ్డి ఇలా కొన్ని చిత్రాల్లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ థియేటర్స్ లో బాగా పేలాయి. ప్రస్తుతం బాలయ్య నుంచి అనిల్ రావిపూడి భగవంత్ కేసరి ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతుంది. అక్టోబర్ 19 న భగవంత్ కేసరి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా కనిపిస్తున్నారు. తాజాగా భగవంత్ కేసరి నుండి ఓ డైలాగ్ లీకైంది అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఊర్లో ఉన్న కుక్కలు ఊర్లోనే మొరగాలి.. అడవిలో మొరిగితే సింహం ఊరుకుంటుందా?.. గర్జిస్తుంది.. అడవి బిడ్డ, భగవంత్ కేసరి.. అంటూ బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ భగవంత్ కేసరి మూవీలోనిదే అంటూ అభిమానులు హడావిడి చేస్తున్నారు. మరి నిజంగా ఇదే డైలాగ్ భగవంత్ కేసరిలో ఉంటే థియేటర్స్ లో ప్రేక్షకులకి గూస్ బంప్స్ గ్యారెంటీ.

కొన్నాళ్లుగా బాలయ్య నోటి నుండి వస్తున్న డైలాగ్స్ బాగా పేలుతున్నాయి. పవర్ ఫుల్ డైలాగ్స్ అంటేనే బాలయ్య అనేలా కొన్నాళ్లుగా దర్శకులు బాలయ్య కోసం డైలాగ్స్ రాసి మాస్ ఆడియన్స్ ని ఊపేస్తున్నారు.

Balayya Bhagavanth Kesari dialogue leak:

 Balakrishna Bhagavanth Kesari dialogue leaked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs