Advertisement
Google Ads BL

ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్ అదేనా?


అమెరికాలో జరిగిన కామిక్ ఐకాన్ లో ప్రాజెక్ట్ K ని కాస్తా ఇప్పుడు కల్కి 2898 ADగా మార్చేశారు. ప్రాజెక్ట్ K టైటిల్ గా పెడితే హాలీవుడ్ ప్రేక్షకులకి బాగా రీచ్ అయ్యేది అనే అభిప్రాయాలను నెటిజెన్స్ వ్యక్తం చేసారు. కల్కి కన్నా ప్రాజెక్ట్ K అంటేనే బావుంది అన్నారు. ఇక నాగ్ అశ్విన్ ప్రభాస్ కల్కి ఫస్ట్ లుక్ తో  నిరాశపరిచినా.. కల్కి గ్లిమ్ప్స్ తో అందరిలో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసారు. ప్రభాస్-కమల్-దీపికా-అమితాబ్ లాంటి స్టార్స్ తో కల్కి మూవీ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతుంది, రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే న్యూస్ అందరికి తెలిసిందే.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్-అశ్విని దత్ లు జనవరి 12 2024 న విడుదల చేస్తామంటూ మహాశివరాత్రి రోజునే ప్రకటించారు. అయితే కొద్దిరోజులుగా కల్కి మూవీ విడుదలపై వస్తున్న వార్తలకు మేకర్స్ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. జనవరి 12 నుండి 2024 సమ్మర్ కి కల్కి రిలీజ్ డేట్ చేంజ్ అవబోతుంది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ గారు ముందే చెప్పారు. రాజమౌళి గారు ఈమధ్యనే కల్కి రిలీజ్ డేట్ విషయమై కన్ఫ్యూజ్ క్రియేట్ చేసారు. మరోపక్క సోషల్ మీడియాలోనూ కల్కి మూవీ విడుదలపై రకరకాల న్యూస్ లు మొదలయ్యాయి.

మరి ఇంత జరుగుతున్నా నాగ్ అశ్విన్ వాళ్ళు ఈ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే కల్కి విడుదల డేట్ మారడానికి ముఖ్య కారణం VFX పనులే అని తెలుస్తుంది. మరోపక్క కల్కి మూవీ మే 9, 2024 న రిలీజ్ అంటూ ప్రచారం షురూ అయ్యింది. దానితో ప్రభాస్ ఫాన్స్ కి నిరాశ ఎదురవ్వబోతుంది అంటున్నారు.. సలార్ విడుదల తర్వాతే కల్కి మూవీ విడుదల పోస్ట్ పోన్ పై మేకర్స్ ప్రకటిస్తారంటున్నారు. కాకపోతే ఈ కన్ఫ్యూజన్ ని ముందే క్లియర్ చేస్తే బావుంటుంది అని చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నారు.

Prabhas Nag Ashwin Kalki 2898 AD Release date change?:

Kalki 2898 AD May 9, 2024 release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs