Advertisement
Google Ads BL

BRO ఈవెంట్ పై ఫన్నీ మీమ్స్


ఈరోజు పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ల బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరగబోతుంది. అయితే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతుంటే.. కొంతమంది మాత్రం ఫన్నీ గా మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ ఫన్నీ మీమ్స్ ఎందుకు అంటే.. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా కొలిచే బండ్ల గణేష్, గురూజీ కి మధ్యలో జరుగుతున్న కోల్డ్ వార్ ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. గతంలో భీమ్లా నాయక్ ఈవెంట్ అప్పుడు బండ్ల గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వద్దామనుకుంటే త్రివిక్రమ్ రానివ్వలేదట.

Advertisement
CJ Advs

కొంతమందిని పోగేసి ఆ ఈవెంట్ లో బండ్లన్న కోసం అరవమన్నాడంటూ, తర్వాత బండ్ల గణేష్ ఆడియో టేపుల లీకు.. త్రివిక్రమ్ తనని పవన్ కళ్యాణ్ దగ్గరకి రానివ్వడం లేదు అంటూ అంటూ బండ్ల గణేష్ ఇండైరెక్ట్ గా గురూజీని ఏసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు బ్రో ఈవెంట్ అప్పుడు కూడా బండ్లన్న స్పీచ్ కావాలంటూ అరవమని బండ్ల గణేష్ ఎమన్నా ప్లాన్ చేసాడేమో.. దానిని త్రివిక్రమ్ అడ్డుకునే ప్లాన్ వేసారేమో అంటూ కొన్ని వీడియోస్ లో బండ్ల గణేష్ ఫేస్, త్రివిక్రమ్ ఫేస్ లు పెట్టి ఫన్నీ వీడియోస్ తయారు చేసి వైరల్ చేస్తున్నారు.

అందరూ బ్రో ఈవెంట్ లో పవన్ ఏం మాట్లాడతారో అని అనుకుంటుంటే.. కొంతమంది మాత్రం త్రివిక్రమ్-బండ్ల గణేష్ మధ్యలో జరిగే కోల్డ్ వార్ పై ఫన్నీ కామెడీ చేస్తూ సరదాగా మాట్లాడుతున్నారు.

Funny memes on BRO pre release event:

BRO Pre-release Event on July 25th at Shilpakala Vedika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs