Advertisement
Google Ads BL

జిమ్ లో నిహారిక కొణిదెల-వితిక


నిహారిక కొణిదెల నిన్నమొన్నటివరకు ట్రెండింగ్ లో ఉన్న పేరు. కారణమేమి లేదు.. ఇష్టపడి అంగరంగ వైభవంగా చేసుకున్న పెళ్లిని రెండేళ్లు కూడా కొనసాగించకుండానే డివోర్స్ తీసుకుని భర్త చైతన్య తో విడిపోయింది. సహజంగానే మెగా ఫ్యామిలీ పై అందరి కన్ను ఉంటుంది. అక్కడ ఏం జరిగినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. అలా మెగా డాటర్ విడాకుల వార్త బాగా పాపులర్ అయ్యింది. ఇక నిహారిక భర్తతో విడిపోయి సైలెంట్ గా బాధపడుతూ కూర్చోవడం లేదు. వీలున్నప్పుడల్లా ఫ్రెండ్స్ తో కలిసి గోవాలోనో.. లేదంటే హైదరాబాద్ లోనో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

మహాతల్లి ఫెమ్ జాన్వీ, వితిక సెరు ఇలా కొంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ తో నిహారిక నిత్యం హడావిడి చేస్తూనే ఉంది. భర్త వరుణ్ సందేశ్ ఎక్కవగా అమెరికాలో ఉండడంతో వితిక ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటుంది. మోడలింగ్, అలాగే సినిమాలు తో బిజీగా కనబడుతుంది. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక కొన్నాళ్ళు కనిపించని వితిక మళ్ళీ యూట్యూబ్ వీడియోస్, నిహారిక ఫ్రెండ్ షిప్ తో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా నిహారిక-వితిక లు జిమ్ లో చేసిన విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిహారిక నడుం పైకి ఎక్కిన వితిక అక్కడ నుండి ఇచ్చిన ఫోజులన్నీ నెటిజెన్స్ ని ఆకర్షించాయి. నిహారిక-వితిక ఇద్దరూ ఎక్కువగా జిమ్ చేస్తూ ఉంటారు. ఫిట్ నెస్ కోసం కష్టపడుతూ ఉంటారు. 

ఇక వితిక అలాగే నిహారికలు ఇప్పుడు యాక్టింగ్ లో జోష్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో వితిక హీరోయిన్ గా నటించింది. పెళ్లి సందడిలో శ్రీలీలకి సిస్టర్ కేరెక్టర్ లో మెరిసింది. నిహారిక కూడా ఇకపై యాక్టింగ్ ని కంటిన్యూ చెయ్యాలనుకుంటుంది. 

Niharika Konidela with Vithika sheru in Gym:

Niharika konidela and vithika sheru gym video viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs