Advertisement
Google Ads BL

ఈ వారం రిలీజ్ చిత్రాలు


ముసురు పట్టినా, ముసుగు తన్నినా ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్మెంట్ ని మిస్సవడం లేదు. థియేటర్స్ లో కొత్త చిత్రాలు, ఓటిటీలలో హిట్ చిత్రాలు, వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ అంటూ సరదాపడుతుంటారు. వారం వారం సినిమాలు విడుదలైనా నెక్స్ట్ వీక్ ఏం విడుదలవుతున్నాయో అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కనబడుతుంది. ఆదిపురుష్ తర్వాత సామజవరగమన, బేబీ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర సందడి చేసాయి. ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యాయి. ఈమధ్యలో ఎన్నో చిన్న చిత్రాల హడావిడి.. అయినా రేపు రాబోతున్న BRO పైనే అందరి చూపు. ఇక ఈ వారం థియేటర్స్ లో ఓటిటీలలో ఏమేమి చిత్రాలు విడుదల కాబోతున్నాయో అంటూ జనాలు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ వారం విడుదల చిత్రాలేమిటో ఓ లుక్కిస్తే పోలా..

Advertisement
CJ Advs

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న BRO సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమా తమిళ్ లో ఘనవిజయం సాధించిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు హీరోగా తెరకెక్కిన స్లం డాగ్ హస్బెండ్ అనే సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. ధోని ఎంటెర్టైనెంట్న్ నుండి వస్తున్న LGM, అలాగే బాలీవుడ్ లో రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ అనే సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.. 

వీటితో పాటుగా ఈ వారం ఓటీటీల నుండి ఏయే చిత్రాలు, ఏయే వెబ్ సీరీస్ లు విడుదలవుతున్నాయో ఆ లిస్ట్ చూద్దాం..

ఆహా:

సామజవరగమన (జులై 28)

నెట్‌ఫ్లిక్స్‌:

డ్రీమ్‌ ( జులై 25)

మామన్నన్‌ (జులై 27)

పారడైజ్‌ (జులై 27)

హిడెన్‌ స్ట్రైక్‌ (జులై 27)

హ్యాపీనెస్‌ ఫర్‌ బిగినెర్స్‌ (జులై 27)

హౌ టు బికమ్‌ ఎ కల్ట్‌ లీడర్‌ (జులై 28)

డిస్నీ హాట్ స్టార్:

ఆషిఖానా ( జులై 24)

సోనీలివ్‌:

ట్విస్టెడ్‌ మెటల్‌ ( జులై 28)

బుక్‌ మై షో:

జస్టిస్‌ లీగ్‌: వార్‌ వరల్డ్‌ (యానిమేషన్‌ మూవీ) జులై 23 10. ట్రాన్స్‌ఫార్మర్స్‌: రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 26 11. ద ఫ్లాష్‌ (జులై 27)

జియో సినిమా:

లయనెస్‌ (జులై 23)

కాల్‌కూట్‌ (హిందీ) జులై 27

New Theaters and OTT Releases This Week:

Must watch OTT and movie release this weekend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs