Advertisement
Google Ads BL

ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న మహేష్


ఇక్కడ హైదరాబాద్ లో గుంటూరు కారం విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాక మహేష్ ఫాన్స్ జుట్టు పీక్కుంటుంటే.. మహేష్ బాబు మాత్రం లండన్ లో భార్య పిల్లలతోనే కాదు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. రెండు రోజుల క్రితమే మహేష్ తన భార్య పిల్లలతో లండన్ ట్రిప్ వెళ్లిన విషయం తెలిసిందే. నమ్రత తాజాగా షేర్ చేసిన ఫొటోస్ లో తమ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ మహేష్ కనిపించారు. రెస్టారెంట్ లో వారు కనిపించడంతో మహేష్ ఇక్కడ సమస్యలన్నీ మేకర్స్ మీద వదిలేసి.. ఇలా లండన్ ట్రిప్ లో సంతోషంగా గడుపుతున్నావా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఆయన నటిస్తున్న గుంటూరు కారం షూటింగ్ ఎంత లేట్ అవుతుందో కానీ.. త్రివిక్రమ్ టీం నుండి ఒక్కొక్కరిగా బయటికెళిపోతున్నారు. గతంలో ఫైట్ మాస్టర్, తర్వాత హీరోయిన్ పూజ హెగ్డే, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నిన్నగాక మొన్న సినిమాటోగ్రాఫర్ గుంటూరు కారం నుండి తప్పుకున్నారు. అసలు త్రివిక్రమ్ తో సమస్యా.. లేదు మహేష్ తో సమస్యతో వారు బయటికెళ్ళిపోతున్నారో అర్ధం కానీ సంకట స్థితిలో ఫాన్స్ ఉన్నారు. ఇక మహేష్ మాత్రం కూల్ గా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆయన తన బర్త్ డే వేడుకల కోసమే లండన్ వెళ్లారు. ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్ తో కలిసి మహేష్ లండన్ లోనే ఆగష్టు 9 న తన పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నట్లుగా సమాచారం. ఇక నమ్రత షేర్ చేసిన పిక్స్ లో మహేష్ హెయిర్ కి క్లిప్ తో కనిపించారు. అలాగే ఎల్లో టీ షర్ట్ లో ఉన్నారు. Bonding over food, stories, and shared joys ♥️♥️ ❤️ #LondonCalling 🇬🇧 #familyfriends అంటూ నమ్రత వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

Mahesh enjoying with family friends:

Mahesh Babu Enjoying In London Trip With His Close Friends
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs