బాలీవుడ్ క్యూటీ అలియా భట్ కి గత ఏడాది ఎంత ప్రత్యేకమో స్పెషల్ గా చెప్పుకోవక్కర్లేదు. కెరీర్ లో ఆర్.ఆర్.ఆర్ లాంటి, సక్సెస్ పర్సనల్ లైఫ్ లో పెళ్లి, పాప అతి పెద్ద సంతోషకరమైన వార్తలు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి ఏప్రిల్ లో పెళ్లాడడం నవంబర్ లోనే పాప కి జన్మనివ్వడం మళ్ళీ మూడు నెలలు తిరక్కుండానే సినిమా షూటింగ్స్ తో అలియా బిజీ అవడం అన్ని ఆశ్చర్య పరిచాయి. తన పాపకి రాహా అని పేరు పెట్టుకున్న ఈ జంట తమ పాపతో ఎలా గడుపుతారో మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్ రూపంలో అభిమానులకు అందించినా.. పాప రాహా ఫేస్ మాత్రం రివీల్ చెయ్యకుండా జాగ్రత్త పడతారు.
అయితే అలియా భట్ బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్, అలాగే రణబీర్ కపూర్ స్టార్ హీరో. అలియా ఫ్యామిలీ, రణబీర్ ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి రిలేటెడ్ ఫ్యామిలీస్. అయితే అలియా భట్ మాత్రం తన కూతురు రాహా తనలా సినిమా రంగాన్ని ఎంచుకోవాలని తాను కోరుకోవడం లేదు అంటుంది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ పదేళ్లలో తన లైఫ్ లో ఎన్నో మార్పులొచ్చాయి. డే అండ్ నైట్ వర్క్, నిద్రమానుకుని ఏకధాటిగా సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా కంటూ ఓ ఫ్యామిలీ ఉంది. నాకు ఓ కూతురు, భర్త ఉన్నారు.
నా ఫ్యామిలీ కోసం ఇకపై నేను కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నా. అలా అని సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వను. కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని, అలాగే తమ కుమర్తె బాగా చదివిపెద్ద సింటిస్ట్ అవ్వాలనేది తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది అలియా భట్.