Advertisement
Google Ads BL

మెల్లగా చొచ్చుకుపోతుంది


ఖిలాడీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని చూసినప్పుడు ఈ పిల్ల హీరోయిన్ ఏంట్రా బాబు.. అసలు ఆమె హీరోయిన్ మెటీరియల్ లా లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి టాలీవుడ్ లో మెల్లగా పాతుకుపోవడానికి రెడీ అయ్యింది. అడివి శేష్ తో హిట్ 2 లో గ్లామర్ గా కనిపించిన మీనాక్షి చౌదరి తర్వాత సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు దిగింది. ఆ అందాల ఆరబోత కాన్సప్ట్ బాగా గిట్టుబాటు అవడమే కాదు.. కూసింత లక్కు ఆమె చెంతకు చేరింది.

Advertisement
CJ Advs

రీసెంట్ గా విజయ్ ఆంటోని తో కలిసి హత్య సినిమాలో నటించిన మీనాక్షి చౌదరి నక్క తోక తొక్కింది అంటూ టాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసి మహేష్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంది మీనాక్షి చౌదరి. ఇప్పుడు తాజాగా వరుణ్ తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయ్యింది. పలాస 1978 చిత్ర దర్శకుడు కరుణ కుమార్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో VT14 తెరకెక్కబోతోంది. ఈనెల 27వ తేదీన ఈ సినిమాను ప్రారంభించనున్నారు.

ఈ చిత్రంలోనే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వరుణ్ సరసన ఎంపికయ్యింది. గుంటూరు కారం, వరుణ్ తేజ్ సినిమాల్లో ఒక్కటి హిట్టయినా అమ్మడి పొజిషన్ టాప్ కు చేరుకుంటుంది. కొద్దిగా ఆలస్యమైనా కెరీర్ లో మంచి పాత్రలతో జెండా పాతేందుకు పక్కాగా ప్లాన్ ని అమలు చేస్తోంది మీనాక్షి.

Meenakshi Chaudhary romance with Varun Tej:

Meenakshi Chaudhary romance with Varun Tej next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs