Advertisement
Google Ads BL

నాగార్జునపై అక్కినేని ఫాన్స్ కినుకు


నాగార్జున ద ఘోస్ట్ రిలీజ్ చేసి అక్టోబర్ కి ఏడాది కావొస్తుంది. ఇంతవరకు నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఘోస్ట్ తర్వాత ఆరు నెలలు విరామం అంటూ ప్రకటించిన నాగార్జున.. తదుపరి ప్రాజెక్ట్ ని జూన్ లోనే అనౌన్స్ చేయబోతున్నారనే న్యూస్ నడవగా అక్కినేని ఫాన్స్ కాస్త ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇంతవరకు నాగ్ కొత్త సినిమా ఊసు లేదు. సినిమా ప్రాజెక్ట్ సంగతి ఎలా ఉన్నా నాగార్జున మాత్రం బిగ్ బాస్ ని వదలడం లేదు. అదే అక్కినేని ఫాన్స్ కి మింగుడు పడడం లేదు.

Advertisement
CJ Advs

సిల్వర్ స్క్రీన్ మీద నాగార్జునని చూడాలనుకుంటే ప్రతిసారి నాగ్ ఇలా బుల్లితెర ఎంట్రీ ఇవ్వడంపై వారు కినుకు వహిస్తున్నారు. గత ఏడాది అలానే సినిమాలకి విరామం ప్రకటించినా బిగ్ బాస్ లో కనిపించారు. సర్లే అని సరిపెట్టుకుంటే.. ఇప్పుడు కూడా కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచన చెయ్యకుండా బిగ్ బాస్ సీజ్ 7 తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రోమోస్ వైరల్ అవుతుండగా.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు నుండి బిగ్ బాస్ కోసం వస్తారు.. ఈలోపులో సినిమాని ప్రకటించమంటూ అక్కినేని ఫాన్స్ నాగార్జునని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. నాగార్జున బెజవాడ ప్రసన్న కుమార్ తో సినిమా చేస్తానని అన్నా అది కార్యరూపం దాల్చలేదు. మరోపక్క మలయాళ హిట్ మూవీని రీమేక్ చేస్తారని అన్నారు. అది కూడా అప్ డేట్ లేదు. మరి నాగ్ తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Akkineni fans are worried:

Akkineni Fans Are Very Worried About Nag Decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs