చిరు-బాలయ్య పోటీపడితే ఆ కిక్కే వేరప్పా !
ఎందో ఈళ్ల గోల..
దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే తంతు..
ఈ వంతులేందో అర్ధంకాదు..
ఎవరూ తగ్గరాయే.. 😊
ఏదేమైనా.. టాలీవుడ్ లో ఎంతమంది హీరోలైనా ఉండనీయండి..
పోటీ అంటే వీళ్లిద్దరిదే.. 🙏🏼
వీళ్లు పోటీపడితే వచ్చే కిక్కు.. ఎవరు పోటీపడ్డా రాదు.. 😂 ఇలా ఓ మూవీ లవర్ మెగాస్టార్ చిరంజీవి-బాలకృష్ణలు పోటీ పడితే ఆ కిక్కే వేరప్పా అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. నిజంగానే ఎంతమంది స్టార్ హీరోస్ ఒకే డేట్ లో పోటీపడినా రాని మజా చిరు - బాలయ్యలు పోటీపడితే వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతినే తీసుకోండి.. బాలయ్య వీరసింహారెడ్డి-మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య అంటూ ఇద్దరూ కలిసి పోటీ పడ్డారు. ఎవ్వరూ తగ్గలేదు. మెగా vs నందమూరి ఫాన్స్ అన్న రేంజ్ లో ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద కుమ్మేసుకున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా వీరి మధ్యన పోటీ ఎప్పుడూ రసవత్తరమే.
ఇప్పుడు కూడా దసరాకు మెగాస్టార్ - బాలకృష్ణలు పోటీ పడతారని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ మెగాస్టార్ కొద్దిగా ముందుగానే బాక్సాఫీసు బరిలోకి దిగిపోతున్నారు. మెగాస్టార్ చిరు-మెహర్ రమేష్ ల భోళా శంకర్ ఆగష్టు 11 న విడుదలకు సిద్ధమైంది. బాలయ్య-అనిల్ రావిపూడి ల భగవంత్ కేసరి ఆక్టోబర్ 19 న విడుదల కాబోతుంది. అదే సంక్రాంతి ఫైట్ దసరాకి కూడా వీరి మధ్యన రిపీట్ అయితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుగా ఉండేది. కానీ మిస్ అయ్యారు. ఫాన్స్ కి ఎలా ఉన్నా మూవీ లవర్స్ కి మాత్రం మజాగా ఉండేది. అందుకే అలాంటి పోస్ట్ లు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఆ పోస్టు పెట్టినాయన మెగాస్టార్ చిరు, బాలయ్యల పిక్స్ ని కూడా జతచేసి మరీ ట్వీటేసాడు.