Advertisement
Google Ads BL

బిగ్ బాస్ కి వెళుతున్న జబర్దస్త్ గ్లామర్


ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ నుండి ప్రతి ఏడాది ఎవరో ఒక కమెడియన్ స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ లోకి వెళ్లడం చూస్తున్నాం. జబర్దస్త్ అవినాష్. చలాకి చంటి ఇలా మంచి కమెడియన్స్ కి భారీ పారితోషకాలిచ్చి మరీ బిగ్ బాస్ లోకి తెచ్చుకుంటున్నారు. గత సీజన్ లో ఫైమా సీజన్ చివరి వరకు హౌస్ లో ఉంది. కామెడీ, ఫిజికల్ ఫైట్ ఇలా ఏ విషయంలోనూ తగ్గలేదు. బిగ్ బాస్ లో తనని తాను నిరూపించుకుంది.

Advertisement
CJ Advs

ఇక ఈ సీజన్ మొదలు కావడానికి సమయం దగ్గరపడుతోంది. బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా నాగార్జునే కన్ ఫర్మ్ అవ్వగా.. ఈ సీజన్ హౌస్ లోకి వెళుతున్న వారిపై అందరిలో ఆసక్తి స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ప్రభాకర్, అమరదీప్ జంట పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జబర్దస్త్ వర్ష పేరు వినిపించడమే కాదు.. ఆల్మోస్ట్ వర్ష ఈ మధ్యన ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా తానొక పెద్ద షోకి వెళ్ళబోతున్నట్లుగా, దాని కోసం ఇప్పటికే చెక్స్ అందుకున్నట్లుగా, ఆ షోలోనే తన గురించి అసలు విషయాలన్ని చెప్పబోతున్నట్లుగా బిగ్ బాస్ పై హింట్ ఇచ్చేసింది.

ఏం చదువుకున్నాను వంటి విషయాలను ఆ షోలోనే రివీల్ చేస్తాను అంటూ వర్ష.. బిగ్ బాస్ పేరు ఎత్తకుండానే మొత్తం చెప్పింది. సో ఈ ఏడాది బిగ్ బాస్ లోకి జబర్దస్త్ నుండి వర్ష ఎంట్రీ ఉండడం పక్కా అన్నమాట. ఇంకా ఎవరెవరు వెళతారో అనేది త్వరలోనే రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది.. ఈ ఏడాది బిగ్ బాస్ సెప్టెంబర్ నుండి కాదు.. ఆగష్టు లోనే మొదలు అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Another Jabardasth comedian going to Bigg Boss:

Jabardasth Varsha going to Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs