Advertisement

మారుతికి ‘కల్కి’ గ్లింప్స్ నచ్చలేదా?


 

Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాకు రీసెంట్‌గా ‘కల్కి 2898 AD’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కూడా వదిలారు. ఈ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాని చూసే రూపమే మారిపోయింది. దర్శకధీరుడు రాజమౌళి వంటి వాడే.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండి అంటూ ఆతృతగా అడిగారంటే.. ఈ గ్లింప్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట వచ్చిన ప్రభాస్ లుక్‌తో డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కూడా.. గ్లింప్స్ తర్వాత ఇది కదా.. సినిమా అంటే అనే రేంజ్‌లో కాలరేగరేస్తున్నారు. అలాంటిది ప్రభాస్‌తో సినిమా చేస్తున్న ఓ దర్శకుడి నుంచి ఇంత వరకు ఈ గ్లింప్స్‌పై ప్రకటన రాలేదంటే విడ్డూరమనే చెప్పుకోవాలి. 

ఇప్పుడిదే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అవుతుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు మారుతి. ప్రస్తుతం ప్రభాస్.. సలార్, కల్కి చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. రాజా డీలక్స్ అని పేరు ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ.. రాజా డీలక్స్ అనే ఓల్డ్ సినిమా థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో తాత మనవళ్ల కథగా ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనేలా వార్తలు వచ్చాయి. సరే.. ఆ విషయం పక్కన పెడితే.. కల్కి గ్లింప్స్‌పై మారుతి ఇంత వరకు ఎందుకు రెస్పాండ్ కాలేదంటూ కొందరు రెబల్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. 

ఒకవేళ ఆయన చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు కాబట్టే.. ఇంత వరకు రెస్పాండ్ అవ్వలేదని అనుకోవడానికి.. నిన్నకాక మొన్న వచ్చిన ‘బేబీ’ సినిమాపై రోజూ ఏదో రకంగా ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు కదా.. అని అంటున్నారు. అంటే మారుతికి ప్రభాస్ చేస్తున్న కల్కి గ్లింప్స్ నచ్చలేదా? అందుకే రియాక్ట్ కాలేదా? అనేలా ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. నేరుగా డార్లింగ్‌కే ఫోన్ చేసి చెప్పి ఉంటాడులే అని.. కొందరు ఫ్యాన్స్ వేడిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సీరియస్ ఇష్యూపై మారుతి కాస్త దృష్టి పెడితే బాగుంటుంది.

Prabhas Fans Serious on Director Maruthi:

Director Maruthi Not Responded on Kalki 2898 AD Glimpse
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement