Advertisement
Google Ads BL

జూలై 27 మెగాస్టార్, జూలై 28 పవర్‌స్టార్


జూలై ఎండింగ్ మెగా ఫ్యాన్స్‌కి మెగా హీరోలు మాములు ట్రీట్ ఇవ్వడం లేదు. అసలైతే ఆగస్ట్ నెల మెగా ఫ్యాన్స్‌కి ఎంతో ప్రత్యేకమైనది. ఆ విషయం చెప్పడానికి ప్రాక్టీస్ అన్నట్లుగా జూలై నెల ఎండింగ్ మారబోతుంది. జూలై జూలై అంటున్నారు.. అసలు విషయం చెప్పడం లేదేంటి? అని అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే.. జూలై 28న మెగా హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్‌ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 

Advertisement
CJ Advs

ఆ సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంటే జూలై 27న మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అదేమంటే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తను నటించిన ‘భోళా శంకర్’ చిత్ర ట్రైలర్‌ను వదల బోతున్నారు. ‘భోళా శంకర్’ ట్రైలర్ విడుదలకు సంబంధించి తాజాగా మెహర్ రమేష్ అప్‌డేట్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి ట్రైలర్ రెడీ చేస్తున్న పిక్‌ని షేర్ చేశారు. ఇందులో ‘భోళా శంకర్’ ట్రైలర్ లోడింగ్ అంటూ.. ట్రైలర్ విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. దీంతో 27న మెగాస్టార్ ట్రీట్ ఇస్తే.. 28న మేనల్లుడితో కలిసి పవర్ స్టార్‌ ట్రీట్ ఇవ్వబోతున్నారంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ‘భోళా శంకర్’కు సంబంధించి వచ్చిన టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాలోని ‘మిల్కీ బ్యూటీ’ పాటను వదిలారు. ఈ పాట ట్రెండింగ్‌లో ఉండగానే ఇప్పుడు ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. ఇలా ఏదో ఒక అప్‌డేట్‌తో ‘భోళా శంకర్’ని కూడా వార్తలలో ఉంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ‘బ్రో’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ చాలు. ఇప్పటికే బీభత్సమైన క్రేజ్, పాజిటివ్ బజ్ సినిమాపై ఉన్నాయి. 28న పాజిటివ్ టాక్ వస్తే చాలు.. ‘బ్రో’ని ఆపడం ఎవరితరం కాదు. మొత్తంగా అయితే వెంటవెంటనే మెగా హీరోల నుంచి ట్రీట్ వస్తుండటంతో.. ఆ ట్రీట్ కోసం వెయిటింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Special Treat to Mega Fans in July Ending:

Mega Star Ready with Bholaa Shankar Trailer and Power Star Ready with Bro
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs