Advertisement
Google Ads BL

మహేష్ వెకేషన్స్-గుంటూరు కారంపై జోక్స్


గత ఏడాదిగా మహేష్ బాబు వెకేషన్స్ అంటూ వెళ్లడం ఆయన త్రివిక్రమ్ తో మొదలు పెట్టిన గుంటూరు కారంపై రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతుంది. 2022 సెప్టెంబర్ లో మొదలైన గుంటూరు కారం షూటింగ్ లో ఇప్పటివరకు ఎన్నో మార్పులు చేర్పులు. చాలా పెద్ద పెద్ద మార్పులే జరుగుతున్నాయి. ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్, ఇంత పెద్ద సూపర్ స్టార్, పెద్ద నిర్మాత. కానీ టెక్నీకల్ గా ఎందుకు ఈ మనస్పర్థలు. ఎవరిలో ఉందా లోపం అనేది మహేష్ ఫాన్స్ కి కూడా అంతుబట్టడం లేదు.

Advertisement
CJ Advs

ఇప్పటికే మహేష్ బాబు వెకేషన్స్ అంటూ ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి గుంటూరు కారంలో ఏదో ఒక మార్పు. మొదలైన ఫస్ట్ షెడ్యూల్ కే ఫైట్ మాస్టర్ అవుట్. మొదటి యాక్షన్ ఎపిసోడ్ పక్కన పడేసారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో మహేష్ స్పెయిన్ వెళ్లారు. అప్పుడు కూడా త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో ఏదో మార్పులు చేసారు అన్నారు. ఏప్రిల్ లో ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కిన మరుక్షణమే పూజ హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చింది. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా ఎంటర్ ఇయ్యి ఇప్పుడు మెయిన్ లీడ్ లో కనిపించబోతుంది. ఇది గుంటూరు కారంలో అతిపెద్ద మార్పు.  

మే లో మహేష్ వెకేషన్స్ లో ఉన్న సమయంలోనే మ్యూజిక్ డైరక్టర్ థమన్ విషయంలో ఎన్నో రూమర్స్. ఇప్పటివరకు దానిపై క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు మహేష్ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం భార్య పిల్లలతో కలిసి ఈ రోజే హైదరాబాద్ వదిలి లండన్ ఫ్లైట్ ఎక్కారు. ఈలోపులో గుంటూరు కారం నుండి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారు. ఆయన సమస్యలు ఆయనవి.. అంటూ మరో న్యూస్ బయటికి వచ్చింది. 

అసలు మహేష్ వెకేషన్స్ కి గుంటూరు కారంలో మార్పులకి ఎమన్నా సంబంధం ఉందా.. ఆ సమస్యల వల్లే మహేష్ బాబు వెకేషన్స్ కి వెళుతున్నారా.. అసలు గుంటూరు కారం విషయంలో ఏం జరుగుతుంది. ఏం జరగబోతుంది. అనుకున్న సమయానికి సినిమా అయినా రిలీజ్ అవుతుందా.. ఇప్పుడు మహేష్ ఫాన్స్ లో ఉన్న ఆ అనుమానం మిగతా ప్రేక్షకుల్లోనూ మొదలైంది. నెటిజెన్స్ అయితే కామెడీగా సెటైర్స్ కూడా వేస్తున్నారు.

DOP PS Vinod walks out of Guntur Kaaram!:

Mahesh Babu leaves for vacay with family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs