Advertisement
Google Ads BL

కాజల్ వెనుక ఎవరున్నారంటే..


కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమా షూటింగ్స్ తో పరుగులు పెడుతుంది. ఆమె కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. సూపర్ హిట్స్ ఉన్నాయి. యావరేజ్ హిట్స్ ఉన్నాయి. ప్లాప్ లు ఉన్నాయి. ఈమధ్యన ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ తన తండ్రి ఓ బిజినెస్ మ్యాన్ అని.. మోడలింగ్ నుండి సినిమా రంగంలోకి వచ్చిన నన్ను ప్రేక్షకులు ఆదరించారు. గత పదేళ్లుగా ప్రేక్షకుల మధ్యలో నిలబడ్డాను అంటే వారి ఆదరణే. కరోనా ముందు వరకు మేనేజర్ ని మెయింటింగ్ చేసిన కాజల్ ఇప్పుడు మాత్రం తన కెరీర్ వెనుక ఎవరున్నారో రివీల్ చేసింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం తన వెనుక తన తల్లి ఉంది అని.. తాను సినిమాలను కూల్ గా చేసుకుంటున్నాను అంటే తన తల్లే కారణమని, ఆమె సినిమా వ్యవహారాలన్నీ చూసుకుంటుంది అంటూ.. కాజల్ ఈమధ్యన తన పనులన్నీ తన తల్లే చూసుకుంటున్నట్టుగా రివీల్ చేసింది. పెళ్లయిన తర్వాత తల్లి తండ్రులని వదిలి వచ్చిన ఫీలింగ్ ఏమి లేదు అని, తన భర్త తల్లితండ్రుల ప్రేమని మరపిస్తున్నాడని చెబుతుంది. అలాగే పెళ్లి తర్వాత, బాబు పుట్టాక భార్య, అమ్మ పాత్రలకి సమన్యాయం చేస్తున్నట్లుగా కాజల్ చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం తన తల్లి సంరక్షణలోనే తన కొడుకు నీల్ ఉంటున్నాడు కాబట్టే తాను కూల్ గా షూటింగ్స్ కి హాజరవుతున్నట్టుగా చెప్పింది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ అలాగే బాలకృష్ణతో భగవంత్ కేసరి మూవీస్ చేస్తుంది. ఇండియన్ 2 రిలీజ్ డేట్ రాకపోయినా.. భగవంత్ కేసరి అక్టోబర్ 19 న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఈ రోజు శనివారమే అఫీషియల్ గా ప్రకటించారు.

Kajal mother is taking care of all the affairs of the film:

Kajal Aggarwal Said That Her Mother Is Taking Care of All Her Film Projects
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs