Advertisement
Google Ads BL

ఎన్నాళ్ళకెన్నాళ్లకి నారా రోహిత్ నుండి అప్డేట్


కొద్దిరోజులుగా కాదు కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయాలకి దగ్గవుతున్నట్టుగా కనిపిస్తున్న నారా రోహిత్.. ఇకపై సినిమాల్లో కనిపించాడేమో అనుకున్నారు. తన ఫ్రెండ్ శ్రీవిష్ణు మూవీ ఈవెంట్స్ కి హాజరయ్యే నారా రోహిత్ ఇకపై సినిమాల్లో నటించాడనే ప్రచారం జోరుగానే జరిగింది. కానీ ఇన్నాళ్ళకి నారా రోహిత్ కొత్త మూవీ అప్ డేట్ వచ్చింది. దానితో ఆయన ఫాన్స్ కాస్త ఎగ్జైట్ అవుతూ కనిపించారు.

Advertisement
CJ Advs

సినిమాల నుంచి కొంత కాలం విరామం తీసుకున్న హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి బాణం, సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఎంచుకొని, చేసిన సినిమాలు, పాత్రలలో వైవిధ్యం చూపించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు రోహిత్.

రోహిత్ తన కమ్ బ్యాక్ మూవీ #NaraRohit19 కోసం ఒక యూనిక్  కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ఈ నెల 24న ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నామని, ప్రీ లుక్‌ పోస్టర్‌ ద్వారా నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు.ప్రీ లుక్  పోస్టర్‌లో చేతిలో వున్న పేపర్ కట్స్ ని చూపిస్తూ One man will stand again, against all odds. అని  రాసిన కోట్ సినిమాలో రోహిత్ పాత్రను సూచిస్తోంది. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్రముఖ తెలుగు దినపత్రికల నుంచి వివిధ ఆర్టికల్స్ వున్న నెంబర్ 2ని కూడా గమనించవచ్చు. ప్రీ లుక్ పోస్టర్ క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన రోజున చిత్ర దర్శకుడు, ఇతర వివరాలను మేకర్స్  తెలియజేస్తారు.

NaraRohit19 First Look on July 24th:

Nara Rohit Comeback Film NaraRohit19 Announced, First Look on July 24th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs