Advertisement
Google Ads BL

బాలయ్య భగవంత్ కేసరి రిలీజ్ డేట్


నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీర సింహ రెడ్డి సక్సెస్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి మొదలు పెట్టారు. బాలకృష-కాజల్ అగర్వాల్ కలయికలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్ర టీజర్ చూసాక నందమూరి ఫాన్స్ బాగా హ్యాపీగా ఉన్నారు. బాలకృష్ణ లుక్స్ కి, ఆయన స్టయిల్ కి అడుగడుగునా ఫిదా అయ్యారు. దసరా టార్గెట్ అంటూ మొదటి నుండి చెబుతూ వస్తున్న అనిల్ రావిపూడి ఈ ముసురులో అంటే వరసగా పడుతున్న వర్షాల్లో భగవంత్ కేసరి అప్ డేట్ అంటూ ఈరోజు ఉదయం నుండే అంచనాలు పెంచుతూ రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటన ఇచ్చారు.

Advertisement
CJ Advs

దసరా కి ఆయుధపూజాకి ఆహ్వానం పలుకుతూ బాలయ్య భగవంత్ కేసరిని అక్టోబర్ 19 న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది🔥 అంటూ బాలకృష్ణ రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని శత్రువులని వేటాడుతూ ఉగ్రరూపాన్ని తలపించిన పవర్ ఫుల్ పోస్టర్ తో భగవంత్ కేసరి విడుదల తేదీని ప్రకటించారు. ఈ దసరాకి మొదటగా తేదీని ఫిక్స్ చేసి భగవంత్ కేసరి టీం ఇలా అప్ డేట్ ఇచ్చింది.

భగవంత్ కేసరి రిలీజ్ డేట్, ఆ పోస్టర్ చూడగానే నందమూరి ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తూ హడావిడి మొదలు పెట్టేసారు. 

Bhagavanth Kesari Release Date Locked:

Bhagavanth Kesari Grand Worldwide Release on October 19th,2023
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs