బియ్యం బస్తాల కోసం జనాలు స్టోర్స్ కి పరిగెత్తడం అనేది వింటే కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద దేశం లో బియ్యం కోసం జనాలు సూపర్ మర్కెట్స్ కి క్యూ కట్టడం కాదు పరుగులు తీస్తున్నారు. కారణం పీఎం నరేంద్రమోడీ గారు బియ్యం ఎగుమతులపై ఎలాంటి ప్రకటన లేకుండానే ఒక్కసారిగా నిషేధం విధించారు. బియ్యం ఎగుమతుల మీద నిషేధం అమల్లోకి కూడా వచ్చింది. దానితో ఇకపై సూపర్ మర్కెట్స్ లో బియ్యం దొరకదేమో అనే కంగారులో ఇండియన్స్ అంతా ఎగబడి బియ్యం కొంటున్నారు.
మోడీ గారు బియ్యంపై నిషేధం విధించనట్లుగా తెలిసిన మరుక్షణమే అందరూ స్టోర్స్ కి పరుగులు పెట్టి ఐదారు బియ్యం కట్టలని కొని ఇంటికి తీసుకెళుతున్నారు. కొంతమందికి ఒక్క కట్ట మాత్రమే దొరకడంతో ఉస్సురుమంటున్నారు. బియ్యం కొరత చూపించి సూపర్ మర్కెట్స్ కూడా అందినంత దోచుకోవడానికి రేట్లు పెంచేశారు. అసలు మోడీగారు ఇలాంటి నిషేధం ఎందుకు పెట్టారో తెలియదు, ఎప్పటివరకు ఈ నిషేధం అమలులో ఉంటుందో తెలియదు. కానీ ఈ నిషేధంతో అమెరికాలోని సౌత్ ఇండియన్స్ లో ఒకరకమయిన భయం మొదలయ్యింది. ఇకపై మనం అన్నం తినలేమా అని.
అమెరికాలో ప్రధానంగా కాలిఫోర్నియా, డల్లాస్ ఇలా తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ బియ్యం సమస్య తీవ్రంగా ఉంది. బియ్యం కోసం ఇంకా ఇంకా జనాలు ఎగబడుతూనే ఉన్నారు. మరి ఇది ఎక్కడివరకు దారి తీస్తుందో అంటూ ఇండియాలోని పలు రాజకీయ పార్టీలు మోడీ నిర్ణయంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.