Advertisement
Google Ads BL

చరణ్ తో సినిమా ఉంటుంది: ప్రభాస్


ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సలార్, ప్రాజెక్ట్ K కల్కి 2898 ఏడీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నారు. కల్కి ఫస్ట్ లుక్ విషయంలో నిరాశపరిచినా.. టీజర్ తో ఆ నిరాశను ఆమడ దూరం పరిగెత్తించారు నాగ్ అశ్విన్. ప్రభాస్ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. కానీ కల్కి 2898 ఏడీ ఫస్ట్ గ్లిమ్ప్స్ తో అది మొత్తం పోయింది. అయితే అక్కడ కమల్ హాసన్ తో ప్రభాస్ చేస్తున్న సందడికి, ప్రభాస్ స్టైలిష్ లుక్స్ కి ప్రభాస్ ఫాన్స్ పొంగిపోతున్నారు. అక్కడ మీడియా వారు బాహుబలి, ఆదిపురుష్‌, సాహో, సలార్‌, ఇప్పుడు కల్కి 2898 ఏడీ.. ఇలా భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇందులో బ్లూ స్క్రీన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.. మీకు వాటిని చూసి బోర్‌ కొట్టడంలేదా? అంటూ ప్రశ్నించగా దానికి ప్రభాస్‌ బదులిస్తూ.. మొదట్లో తనకు చాలా బోర్‌ కొట్టిందని చెప్పారు. అంత పెద్ద బ్లూ స్క్రీన్‌ ముందు తాను చాలా చిన్నగా కనిపించేవాడినని, కానీ గ్లింప్స్‌ చూశాక ఆనందం వేసిందని అన్నారు. బాహుబలితో తనని ప్యాన్ ఇండియా స్టార్ ని చేసిన రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఇండియాలోని అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆర్‌.ఆర్‌.ఆర్‌ చాలా గొప్ప సినిమా. ఆ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అది భారతదేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. రాజమౌళి ఇలాంటి వాటికి అర్హుడు. 

ఇక తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గురించి మాట్లాడిన ప్రభాస్ ఆయనతో సినిమాపై కూడా కామెంట్ చేసారు. రామ్‌చరణ్‌ నాకు మంచి ఫ్రెండ్. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం.. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసారు. చరణ్ తో సినిమాపై చేసిన కామెంట్స్ తో అటు మెగా ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యేలా చేసాయి.

Prabhas promises collaborations with Ram Charan:

 Prabhas: Ram Charan is my friend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs