Advertisement
Google Ads BL

పవన్ కి బాబు కూడా..


పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్ర మొదలు పెట్టకముందు నుండే టీడీపీ, బీజేపీ లతో పొత్తు ఉంటుంది.. విపక్షాలన్నీ ఏకమై జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రధమ కర్తవ్యం అంటూ మట్లాడారు. స్టిల్ ఇప్పటికి పవన్ కళ్యాణ్ అదే మాటకి కట్టుబడి ఉన్నారు. అయితే జనసేనకి బీజేపీ తో పొత్తు కుదిరినా టీడీపీ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ చంద్రబాబు తాజాగా పవన్ కళ్యాణ్ కి బాసటగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై జగన్ పెడుతున్న కేసులపై ఆయన పవన్ కి అనుకూలంగా ట్వీట్ వేశారు.

Advertisement
CJ Advs

తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారిపై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు...రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యింది. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి... ఈ అణచివేత ధోరణి మానుకోవాలి.

నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు...కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు...పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలి.  

ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే  పెద్ద జోక్. 4 ఏళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయి. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి... రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి....మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి. అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Chandrababu tweet in support of Pawan Kalyan:

Chandrababu slams govt. over its decision to file a case against Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs