బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తన రిలేషన్ షిప్ ని రీసెంట్ గానే రివీల్ చేసింది మిల్కి బ్యూటీ తమన్నా. విజయ్ వర్మతో కొన్నాళ్ళు సీక్రెట్ గా డేటింగ్ చేసిన తమన్నా లస్ట్ స్టోరీస్2 ప్రమోషన్స్ లో అతనిలో లవ్ లో ఉన్నట్లుగా బయటపెట్టింది. విజయ్ వర్మ కూడా తమన్నాని పిచ్చిగా ప్రేమిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తనని బాగా చూసుకునే వ్యక్తి విజయ్ వర్మ, అతను నేను డౌన్ లో ఉన్నప్పుడు సపోర్ట్ గా నిలుస్తాడు. విజయ్ చాలా మంచి వాడు అంటూ తమన్నా కూడా చెప్పుకొచ్చింది. అయితే వీరి ఎంగేజ్మెంట్-పెళ్లిపై బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నా ఈ జంట ఇప్పటివరకు స్పందించని లేదు.
తాజాగా విజయ్ వర్మ పెళ్లిపై తనపై ఎంత ప్రెజర్ ఉందో అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తమ ఫ్యామిలీ మార్వాడి ఫ్యామిలీ అని.. మార్వాడీస్ లో 16 ఏళ్లకే అబ్బాయిలకి పెళ్లీడు వచ్చేస్తుంది. అందుకే మా అమ్మ తరచూ నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ అని అడుగుతుంది. నేను మాత్రం కెరీర్ లో సెటిల్ అవ్వాలని తప్పించుకునేవాడిని. కానీ ఇప్పుడు నా పెళ్లి వయసు దాటిపోయి చాలా ఏళ్లయ్యింది. అయినా మా అమ్మ మాత్రం ఎప్పుడు ఫోన్ చేసినా ముందుగా పెళ్లి గురించే మాట్లాడుతుంది. ఇక నేను నటుడిగా సెటిల్ అవడంతో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను. పెళ్లికన్నా ముందు నేను కెరీర్ పై దృష్టి పెట్టాను.
అయితే ఇప్పుడు సినిమాల్లో బిజీగా వున్నాను, అప్పుడే పెళ్లి వద్దు అని అమ్మ నుండి తప్పించుకునే ఛాన్స్ లేదు, అంటూ తమన్నాతో తన పెళ్లి అతి త్వరలోనే ఉండబోతుంది అనే హింట్ అయితే విజయ్ వర్మ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న తమన్నా పెళ్లి విషయమై ఏం చెబుతుందో అనే ఆరాటంలో ఆమె ఫాన్స్ కనిపిస్తున్నారు. ఆమె నటించిన జైలర్, భోళా శంకర్ మూవీస్ ఒక రోజు తేడాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.