Advertisement

వరుణ్ తేజ్-లావణ్య వెడ్డింగ్ డేట్ ఫిక్స్?


వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో జూన్ 9 న నిశ్చితార్ధం చేసుకున్నాడు. మెగా ఫ్యామిలోకి చిన్న కోడలిగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టబోతుంది. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల ఎంగేజ్మెంట్ సింపుల్ గా జరిగిపోయింది. ఐదేళ్ల ప్రేమని పెళ్లి బంధంగా మార్చుకోబోతున్న వరుణ్ తేజ్-లావణ్య లు వివాహంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నాగబాబు కూడా ఈ విషయమై మౌనంగానే ఉన్నారు. అటు నిహారిక విడాకులతో కాస్త బాధపడిన నాగబాబు ఫ్యామిలీ.. తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది.

Advertisement

ఈమధ్యనే రామ్ చరణ్-ఉపాసనలకు పాప జన్మించడంతో బారసాల వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలిలో వరుణ్-లావణ్య పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు డిసెంబర్ లో పెళ్లి పీటలెక్కుతారనే ప్రచారం జరిగింది. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ స్టయిల్లో ఇటలీ లో వీరి వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహానికి ఆగష్టు 24 వ తేదీని నిశ్చయించినట్లుగా తెలుస్తుంది. 

ఇటలీలోని వరుణ్ తేజ్-లావణ్యల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుంది అని.. ఈ పెళ్ళికి కూడా మెగా ఫ్యామిలీ తో పాటుగా లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు అలాగే ఇరువురు స్నేహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తుంది. అయితే ఆగష్టు 24 న పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్.. ఆయన నటించిన గాండీవధర అర్జున ఆగష్టు 25న విడుదల కాబోతుంది. ఆ విషయం తెలిసాక మెగా ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

Wedding Date Of Varun and Lavanya:

Varun Tej - Lavanya To Get Hitched At This Country On This Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement