Advertisement
Google Ads BL

కేసుపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్


ఢిల్లీ టూర్ ముగించుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కి జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలకగా.. వైసీపీ పార్టీ నుండి విశాఖ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న పంచకర్ల రమేశ్‌బాబు ఈరోజు మంగళగరిలోని జనసేన కార్యాలయంలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.. వాలంటీర్ల గురించి మాట్లాడినందుకు నన్ను ప్రాసిక్యూట్‌ చేయమని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. నన్ను అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి. ప్రజల కోసం అన్నీ భరిస్తాను. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైన సిద్ధంగా ఉన్నా. న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తాయి. హత్యలు చేసిన వాళ్లను ఎలా కాపాడుతున్నారో చూస్తున్నాం. మీరు చేసే పనులు కోర్టులు కూడా చూస్తున్నాయి. 

Advertisement
CJ Advs

నన్ను ప్రాసిక్యూట్‌ చేయమని జీవో ఇచ్చారు.. నీ ప్రభుత్వాన్ని కిందకు దించేది ఈ జీవోనే. జగన్‌కు తన మన అనే తేడా లేదు. నాకు జగన్‌పై వ్యక్తిగత ద్వేషం లేదు. వైసీపీ  అధికారంలోకి వస్తే కొండలతో సహా దోచేస్తారని ముందే చెప్పా. ముందు జగన్ ని ఇంటికి పంపాలి, వీలైతే జైలుకి పంపించాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.  ఏ పార్టీ నుంచి వచ్చినా చిత్తశుద్ధితో పనిచేసే వారిని స్వాగతిస్తా. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి దిల్లీ వెళ్లాను. గతంలో నాకు అపాయింట్‌మెంట్‌ రాలేదని కొందరు విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర BJP నేతలతో నా బంధం ప్రత్యేకం. అది కేసుల మాఫీ కోసం కాదు, అప్పుల కోసం కాదు. నేను వారిని ఎప్పుడూ అపాయింట్‌మెంట్‌ కోరలేదు. అవసరమైతే వాళ్లే ఆహ్వానిస్తున్నారు..

ఏపీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని అమిత్‌ షా నాతో చెప్పారు. ప్రజలందరూ కోరుకుంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటా. సమాజంలో మార్పు తెచ్చే అధికారం కావాలని కోరుకుంటున్నా. నేను సీఎం కావటం కంటే ప్రజలందరూ బాగుండాలని నా కోరిక. డేటా చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. ప్రభుత్వాల వద్ద ఉండాల్సిన డేటాను ఎలా బయటకి ఇచ్చారు. ఏ జీఓ ప్రకారం అనుమతి ఇచ్చారు. ఏపీ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి వచ్చాడు. మీ సీఐ మా నాయకుడిని కొట్టారు. మానవహక్కుల ఉల్లంఘన కాదా. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది. ఈ అంశాలనే ఎస్పీకి నేను వివరించాను.. అంటూ తనపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుపై పవన్ ఘాటుగా స్పందించారు.

Pawan Kalyan Sensational Comments On CM Jagan:

Pawan Kalyan Sensational Comments on AP CM YS Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs