తెలంగాణాలో బోనాల జాతర ముగిసింది. కానీ చిన్న సినిమాల బాక్సాఫీసు జాతర ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గత నెలలోను చిన్న సినిమాల జాతర కనిపించినా, ఈ జులై నెలలోనూ చిన్న సినిమాలు వారం వారం విడుదలవుతూనే ఉన్నాయి. గత వారం బోలెడన్ని సినిమాలు విడుదల కాగా.. అందులో బేబీ హిట్ అయ్యింది.. ఈ వారం గురువారం హిడింబతో మొదలైన సినిమా రిలీజ్ లు రేపు శుక్రవారం వరకు కొనసాగుతున్నాయి. ఈరోజు గురువారం అశ్విన్ బాబు హిడింబ రిలీజ్ అయ్యింది. పబ్లిక్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తో రన్ అవుతుంది.
ఇక రేపు జులై 21 శుక్రవారం చిన్న సినిమాలు చాలా విడుదలకు సిద్ధమయ్యాయి. తెలంగాణాలో బోనాల జాతర ముగిసింది, మూడు రోజుల నుండి వర్షాలు, అయినా మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు. రేపు రాబోతున్న సినిమాల్లో అన్నీ చిన్న సినిమాలే. అందులో అన్నపూర్ణ ఫోటో స్టూడియో, రుహని శర్మ నటించిన హర్ చాఫ్టర్ 1 ఈ రెండు సినిమాలే కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. ఇక అలా ఇలా ఎల అంటూ వెరైటీ టైటిల్ తో మరో సినిమా, నాతో నేను, ఒక్కడే వీరుడు, డిటెక్టివ్ కార్తిక్ తో పాటుగా బిచ్చగాడు 2 తో హిట్ కొట్టిన విజయ్ ఆంటోని హత్య మూవీ అలాగే, కాజల్ అగర్వాల్ కార్తీక డబ్బింగ్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
మరి ఈ చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందో అనేది చూడాలి. ఇవే కాకుండా.. ఓటిటీల్లోనూ లెక్కకి మించిన చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. అంతేకాకుండా ఓప్పెన్ హెయిమర్, బార్బీ చిత్రాలపై యూత్ కన్ను పడింది. ఆ రెండు చిత్రాలు విడుదలవుతున్న థియేటర్స్ లో టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు.