Advertisement
Google Ads BL

ముదురుతున్న హిర‌ణ్య క‌శ్య‌ప వివాదం


రుద్రమదేవి తర్వాత దర్శకుడు గుణశేఖర్ హీరో రానా మెయిన్ లీడ్ లో హిర‌ణ్య క‌శ్య‌ప మూవీని ప్రకటించారు. అయితే రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్ లో హిర‌ణ్య క‌శ్య‌ప అప్ డేట్ వచ్చి కొన్నేళ్లు గడిచిపోయింది. ఈ లోపులో గుణశేఖర్ శాకుంతలం అంటూ ఓ మూడేళ్లు వేరే ప్రాజెక్ట్ మీదకి వెళ్లిపోయారు. హిర‌ణ్య క‌శ్య‌ప అనౌన్సమెంట్ వచ్చాక రానా పలు సినిమాలు చేసాడు. ఇక గుణశేఖర్-రానా హిర‌ణ్య క‌శ్య‌ప ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే ప్రచారం జరిగినా గుణశేఖర్ మాత్రం ఆ ప్రాజెక్ట్ ఉంది అని చెబుతూ వస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈలోపులో రానా అమెరికాలో ప్రభాస్ ప్రాజెక్ట్ K కోసం వెళ్ళాడు. అక్కడ నుండే రానా తన డ్రీం ప్రాజెక్ట్ హిర‌ణ్య క‌శ్య‌పపై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. హిర‌ణ్య క‌శ్య‌ప లుక్ తో ఈ ప్రాజెక్ట్ ని రానా అనౌన్స్ చేసాడు. రానానే ఇందులో హిర‌ణ్య‌క‌శ్య‌పుడి పాత్ర పోషించ‌బోతున్నాడు. ఈ సినిమా అమ‌ర్ చిత్ర‌క‌థల స్ఫూర్తితో తెర‌కెక్క‌నున్న‌ట్లు గా చెప్పిన రానా.. ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తున్న‌ది త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అంటూ ప్రకటించాడు. ఇదంతా ఓకె కానీ దర్శకుడిపై మాత్రం రానా ఎటువంటి క్లూ ఇవ్వలేదు. 

కానీ ఈ ప్రాజెక్ట్ నుండి గుణశేఖర్ ని తప్పించారనేది మాత్రం క్లియర్ గా అర్ధమవుతుంది. దానితో ఈ ప్రాజెక్ట్ పై గుణ శేఖర్ ఇండైరెక్ట్ గా స్పందించారు. నాకు అన్యాయం జరిగితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా వెళ్తా. అది ఎవరైనా సరే అంటూ రానా హిరణ్య కశ్యప అనౌన్సమెంట్ పై గుణశేఖర్ స్పందించారు.

Rana announces Hiranyakashyapa with Trivikram:

Gunasekhar cryptic tweet on Rana-Trivikram Hiranyakashyap
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs