జనసేన నేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎక్కడ సక్సెస్ అవుతుందో అని మల్లగుల్లలు పడుతున్న వైసీపీ నేతలు ఇప్పడు ఆయన ఢిల్లీ పర్యటన చూసి మరింతగా నలిగిపోతున్నారు. ఆయన నిన్న మంగళవారం ఢిల్లీలో జరిగిన NDA సమావేశానికి హాజరయ్యారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుతోనే ముందుకెళతామంటూ మరోసారి స్పష్టం చేసారు. అయితే బీజేపీ, పవన్, టీడీపీ ఎక్కడ కలిసిపోయి పోటీ చేసి తమని ఓడిస్తాయో అని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి పీఎం మోడీకి దూతగా, మీడియేటర్ గా వెళ్లి సంధి చేసుకోవడానికి ఆరాటపడుతున్నారంటూ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతున్నారు.
మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఆగ్రహంతో ఊగిపోవడమే కాదు.. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం చర్చనీయాంశమయ్యింది. తన తల్లిని తిట్టినవాడి కోసం పవన్ కల్యాణ్ దళారిగా మారడం సిగ్గుచేటు. సిగ్గులేకుండా మూడు పార్టీలతో కలిసి పోటీచేస్తామని పవన్ అంటున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిన చంద్రబాబుని ఎన్డీయే సమావేశానికి పిలవలేదు. పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక పవన్ మళ్లీ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని ఎద్దేవా చేసింది.
పవన్ కళ్యాణ్ సినిమాలు వెనక, రాజకీయాల వెనక ఆయన అన్న చిరంజీవి ఉన్నారు. ఆయన అండ లేనిదే పవన్ కళ్యాణ్ ఎదగలేడు, ఆనాడు ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోను.. గొంతు కోసుకుంటా అన్నాడు. ఇప్పుడేమో పొత్తులు అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నాడు. చంద్రబాబు ఎంత ఊసరవెల్లో బీజేపీకి బాగా తెలుసు. వారాహి యాత్రలో ఊగిపోయిన పవన్‌కు రాష్ట్రం మీద ఎలాంటి అవగాహన లేదు. సీఎం అంటే అర్థం తెలియకుండా పవన్ ఏదేదో మాట్లాడుతున్నాడంటూ రోజా కామెంట్స్ చేసింది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఎక్కడ విజయవంతం అవుతుందో అనే భయంలో మంత్రి అమర్నాథ్ రెడ్డి, రోజా, అంబటి, ఇంకా మిగతా వైసీపీ మంత్రులు, వైసీపీ నేతలు అంతా ఉలిక్కిపడుతున్నారు.